OTT Movie : ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి భాషలోనూ ఇలాంటి జనర్ ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. థ్రిల్లర్ లవర్స్‌కు ఇన్వెస్టిగేషన్ తో పిచ్చెక్కించే ఒక సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ తమిళ సినిమా ఒక స్ట్రేంజర్ జరగబోయే నేరాల గురించి పోలీసులకు కాల్స్ చేయడంతో మొదలవుతుంది. ఈ స్టోరీ చివరి వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ కథ ఒక మిస్టీరియస్ స్ట్రేంజర్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి, భవిష్యత్తులో జరగబోయే క్రైమ్స్, అక్సిడెంట్స్ గురించి హింట్ ఇవ్వడంతో మొదలవుతుంది. మొదట్లో ఈ కాల్స్‌ను పోలీసులు ప్రాంక్‌గా భావిస్తారు. కానీ త్వరలో ఆ ఇన్ఫర్మేషన్ రియల్‌గా ఉన్నట్లు తేలుతుంది. డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేతృత్వంలో పోలీసు టీమ్ ఈ మిస్టీరియస్ కాలర్ గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో కాలర్ ఒక మహిళ డెత్ గురించి వార్నింగ్ ఇస్తాడు. దీని ఆధారంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ కాల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి.
పోలీసులు అక్సిడెంట్స్‌ను ఆపడానికి ప్రయత్నిస్తుంటారు. ఆదిత్య మొదట కాలర్‌ను ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉన్న ఇన్నోసెంట్ మ్యాన్‌గా భావిస్తాడు. కానీ నిజం బయటపడుతుంది. కాలర్ ఒక ప్రొఫెట్ లా కనిపించే వ్యక్తి. అతని మోటివ్, ఐడెంటిటీ షాకింగ్ ట్విస్ట్‌తో బయటికి వస్తాయి. ఆ ట్విస్ట్లు ఏమిటి ? ఆ స్ట్రేంజర్ ఎవరు ? ఆదిత్య అతన్ని పట్టుకుంటాడా ? స్ట్రేంజర్ చెప్పేవన్ని ఎలా జరుగుతున్నాయి ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
‘థీర్కదరిశి’ (Theerkadarishi)పి.జి. మోహన్, ఎల్.ఆర్. సుందరపాండి దర్శకత్వంలో వచ్చిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రం శ్రీ సరవణా ఫిల్మ్స్ పతాకంపై బి. సతీష్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కింది. ఇందులో సత్యరాజ్, అజ్మల్ అమీర్ ప్రధాన పాత్రల్లో నటించారు. పూర్ణిమా భాగ్యరాజ్, ధుష్యంత్, జైవంత్, శ్రీమాన్, దేవదర్శిని సపోర్టింగ్ రోల్స్‌లో ఉన్నారు. చెన్నై, పుడుచ్చేరిలో షూట్ అయిన ఈ సినిమా 2023 మే 5న థియేటర్లలో విడుదలై, మిక్స్డ్ టాక్ పొందింది. 2023 జూన్ 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ భాషలో ప్రధానంగా అందుబాటులో ఉంది.
Read Also : పోలీస్ వ్యవస్థపై పగతో హత్యలు… శవాల దగ్గర కవితలు వదిలేసి హింట్ ఇచ్చే సీరియల్ కిల్లర్… ప్రతీ సీన్ క్లైమాక్స్