E-Paper
Advertisement

మైనర్‌ చేతిలో కారు స్టీరింగ్‌.. నోయిడాలో మరో షాకింగ్‌ ఘటన, ఏం జరిగింది?

మైనర్‌ చేతిలో కారు స్టీరింగ్‌.. నోయిడాలో మరో షాకింగ్‌ ఘటన, ఏం జరిగింది?
Advertisement

Noida: ఈ మధ్యకాలంలో మైనర్లు ఎక్కువగా వాహనాలు నడుపుతూ బుక్కవుతున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్నారు కూడా. అయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను డ్రైవింగ్ చేయాలని మైనర్లను ప్రొత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా అలాంటి ఘటన నోయిడా చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

 

నోయిడాలో మరో షాకింగ్ ఘటన

Advertisement

నోయిడాలో 15 ఏళ్ల బాలుడు కారు నడుపుతూ మరో కారుని బలంగా ఢీ కొట్టాడు. దెబ్బతిన్న కారులో పసికందుతో ఓ తల్లి ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటన తర్వాత స్థానికులు కారు ఆపడంతో ఆ బాలుడు పారిపోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఘటన గురించి తెలియగానే బాలుడి తల్లి అక్కడికి చేరుకుంది. కుటుంబ డ్రైవర్ అందుబాటులో లేడని, అందుకే బాలుడు డ్రైవింగ్ చేశాడంటూ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ ఘటన తల్లిదండ్రుల బాధ్యత-మైనర్ల డ్రైవింగ్‌పై విమర్శలకు దారి తీసింది.

మైనర్‌ చేతిలో కారు స్టీరింగ్‌

మైనర్‌ను వాహనం నడపడానికి ఎవరు అనుమతించారని దెబ్బతిన్న కారు యజమాని ప్రశ్నించడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది.ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఘటనా స్థలంలో ఉన్నవారు యువకుడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని ప్రశ్నించగా, ఆ బాలుడు, అతడి తల్లి లైసెన్స్ లేదని ఒప్పుకున్నట్లు సమాచారం. కొడుకును వెనుకేసుకు వచ్చిన తల్లి వివరణపై ఆన్‌లైన్‌లో విమర్శలు తీవ్రమయ్యాయి. బహిరంగ రహదారిపై మైనర్ కారు నడపడానికి ఎలా అనుమతించారని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

మరో కారుని ఢీ కొట్టిన మైనర్, సోషల్ మీడియా చర్చ

Advertisement

ప్రమాదానికి గురైన వాహనంలో పసిబిడ్డ ఉండటంతో ఈ ఘటనపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ ఘటనలో కారు ఢీ కొనడం వల్ల మరొక కారుకి తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ అందులో ఉన్నవారు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. లైసెన్స్ లేని మైనర్‌ను వాహనం నడపడానికి అనుమతించడం వల్ల ఇతర వినియోగదారులను ప్రమాదంలో పడేస్తుందని చెప్పడానికి ఈ సంఘటన వెలుగులోకి తెచ్చింది. ప్రమాదం వేరే విధంగా జరిగి ఉంటే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

ALSO READ: కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులపై దాడి.. పలువురికి గాయాలు, ఇంతకీ అక్కడ-ఏం జరిగింది?

ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మైనర్లు వాహనాలు నడపకుండా నిరోధించేందుకు తల్లిదండ్రులు-వాహన యజమానులు బాధ్యత వహించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో తల్లిదండ్రులను బాధ్యులుగా చేయాలని, వారికి ఒక్క రోజు శిక్ష విధించి కోరుతున్నారు. మైనర్‌ చేత కారు నడిపించిన తల్లిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

 

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×