E-Paper
Advertisement

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!
Advertisement

Preamble Recitation: స్వేచ్చ బ్యూరో: దేశవ్యాప్తంగా స్కూళ్లలో ఉదయం నిర్వహించే అసెంబ్లీలో రాజ్యాంగ పీఠికను పఠించాలని ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్​ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్​ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్​ పై విచారణ జరిపింది. పాఠశాలల్లో 6వ తరగతిలో ఇప్పటికే పీఠికను బోధిస్తున్నారని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఉదయం జరిగే అసెంబ్లీలో రోజూ రాజ్యాంగ పీఠికను పఠించడాన్ని తప్పనిసరి చేస్తూ ఒక జాతీయ విధానాన్ని రూపొందించేలా ఆదేశించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం ​ దాఖలైంది.

21A కింద..

ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజధాని కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న ధీరజ్ కుమార్ ఈ పిటిషన్​ను దాఖలు చేశారు. పాఠశాల విద్యార్థుల్లో రాజ్యాంగ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ఫ్రేమ్​వర్క్​ను రూపొందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ను ఆదేశించాలని కోరారు. ఉదయం ప్రార్థనల సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించినట్లే, ప్రవేశికను క్రమం తప్పకుండా సామూహికంగా పఠించేలా చూడాలన్నారు. ఆర్టికల్ 21A కింద ప్రాథమిక విద్య హక్కును, ఆర్టికల్ 51A(a) కింద ప్రాథమిక విధులను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో చిన్న వయస్సు నుంచే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి మద్దతుగా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు జారీ చేసిన సర్క్యులర్లను పిటిషన్​ కు జతచేశారు.

Advertisement

Also read: తెలుగు సినిమాల్లో ఎప్పటికీ మారని కామెడీ సీన్లు ఏంటో తెలుసా ?

ఏకరీతి జాతీయ విధానం..

ఈ సర్క్యులర్లు రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీల సమయంలో విద్యార్థులతో ప్రవేశికను పఠింపజేయాలని ఆదేశించాయి. రాజ్యాంగ విద్యకు సంబంధించి ఏకరీతి జాతీయ విధానానికి ఇటువంటి పద్ధతులు ఒక నమూనాగా ఉపయోగపడతాయని పిటిషన్‌ లో వాదించారు. అసెంబ్లీల్లో రోజూ సానుకూల వాక్యాలను చేర్చాలని పాఠశాలలను కోరుతూ మే 2025లో సీబీఎస్ఈ జారీ చేసిన సర్క్యులర్‌ను ప్రస్తావించారు. రాజ్యాంగ పీఠికను క్రమం తప్పకుండా పఠించడం విద్యార్థుల్లో రాజ్యాంగ విలువలను, పౌర చైతన్యాన్ని పెంపొందించడానికి ఒక అర్థవంతమైన మార్గమని వాదించింది. వాదనల అనంతరం పాఠశాలల్లో 6వ తరగతిలో ఇప్పటికే పీఠికను బోధిస్తున్నారని వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.

Advertisement

Also read: బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Tags

Related News

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

10 సీఎన్‌జీ బస్సులు దగ్ధం.. షార్ట్ సర్క్యూట్ కారణమా? ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×