20 Years Fugitive Arrest | భారత సైన్యంలో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి 20 ఏళ్ల క్రితం తన భార్యను హత్య చేశాడు. ఆ తరువాత పోలీసులు అతడిని దోషిగా నిరూపించడంతో కోర్టు అతనికి యావజీవ కారాగార శిక్ష విధించింది. అయితే అతను జైలు నుంచి పెరోల్ పై బయటికి వచ్చి ఆ తరువాత ఎవరికీ కనబడకుండా పోయాడు. కానీ ఇన్నాళ్ల తరువాత అనుకోకుండా పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఈ కేసులో దోషి 20 ఏళ్లుగా ఎలా తప్పించుకోగలిగాడనేది కీలకంగా మారింది. ఈ వ్యవధిలో అతను మరో వివాహం చేసుకొని హాయిగా భార్య, పిల్లలతో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఢిల్లీ పోలీసులు అతడిని మధ్య ప్రదేశ్ నుంచి పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. అనిల్ కుమార్ తివారి అనే 58 ఏళ్ల వ్యక్తి.. మధ్య ప్రదేశ్ లోని సిధి ప్రాంతానికి చెందినవాడు. 20 ఏళ్ల క్రితం వరకు అనిల్ కుమార్ ఇండియన్ ఆర్మీలో డ్రైవర్ గా ఉద్యోగం చేసేవాడు. అయితే మే 1989లో అనిత్ కుమార్ తన భార్యను గొంతునులిమి హత్య చేశాడు. ఆ తరువాత శవానికి నిప్పంటించేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కానీ పోలీసులు మాత్రం అతడే తన భార్యను హత్య చేశాడని విచారణలో తేల్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేల్చారు. దీంతో అతడిని మే 31, 1989న అరెస్ట్ చేశారు. కానీ ఆ కేసు కోర్టులో అలా చాలా కాలం విచారణ కొనసాగింది. చివరికి కోర్టు అతడికి యావజీవ కారగార శిక్ష విధించింది. హంతకుడు కావడంతో అతని ఆర్మీ ఉద్యోగం కూడా ఊడింది.
ఈ క్రమంలో తీహార్ జైలు నుంచి పెరోల్ పై విడుదల కావడానికి ఢిల్లీ హై కోర్టులో పిటీషన్ వేశాడు. హై కోర్టు అతడికి అనుమతించడంతో 2005, నవంబర్ 1న అనిల్ కుమార్ తివారీ జైలు నుంచి రెండు వారాల పెరోల్ పై విడుదల అయ్యాడు. కానీ పెరోల్ ముగిసినా అతను తిరిగి జైలుకు రాలేదు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం వెతుకుతూనే ఉన్నారు.
అలా 20 ఏళ్లుగా వెతుకుతూ చివరికి ఇటీవల ఏప్రిల్ 12, 2005న అతని స్వగ్రామం సిధిలో ఉన్నాడని తెలుసుకొని కాపు కాసి పట్టుకున్నారు. కానీ అది అంత ఈజీగా జరగలేదు. ఈ 20 ఏళ్లలో అనిల్ కుమార్ తన పేరు మార్చుకొని జీవించాడు. చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. 20 ఏళ్లుగా ఒక్కసారిగా కూడా ఫోన్ కొనలేదు. పైగా ఎప్పుడూ నగదు లోనే లావాదేవీలు చేశాడు.
Also Read: ఐపిఎల్ చూస్తూ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చిన బాలుడు.. పొరుగింటి వ్యక్తి మృతి
మళ్లీ తన కొత్త స్నేహితులతో ఆప్యాయంగా ఉంటూ వారి ద్వారా మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ద్వారా అతనికి నలుగురు పిల్లలు కలిగారు. అయితే అతని కోసం పోలీసులు 20 ఏళ్లుగా గాలిస్తూ ఇన్‌ఫార్మర్లను పెట్టారు. ఇటీవలే అతడిని కొందరు ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో చూశారు. దీంతో పోలీసుల టీమ్ అలర్ట్ అయింది. సిసిటీవీ వీడియోలు పరిశీలిస్తూ.. అతను ఎటువైపు వెళ్లాడో గమనించారు. ప్రయాగ్ రాజ్ నుంచి ట్రక్కులో బయలు దేరి అతను మధ్య ప్రదేశ్ సిధిలోని చుర్ హాట్ గ్రామంలో ఉన్నాడని తెలిసింది. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి అతడిని క్రమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు.