BigTV English

Massive Explosion: భారీ పేలుడు.. ధాటికి నలుగురు మృతి

Massive Explosion: భారీ పేలుడు.. ధాటికి నలుగురు మృతి

4 Died in Massive Explosion of Chemical Factory: భారీ ప్రమాదం సంభవించింది. అనుకోకుండా ఒక్కసారిగా మధ్యాహ్నం సమయంలో మంటలు చెలరేగాయి. అనంతరం ఆ మంటలు భారీగా ఎగిసి పడి అక్కడే ఉన్న రెండు బిల్డింగులకు వ్యాపించాయి. భారీగా ఎగిసిపడిన మంటల్లో నలుగురు మృతిచెందారు. 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.


ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఫ్యాక్టరీ నుంచి మంటలు ఎగిసి పడుతుండడం, పొగలు వెలువడుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాక్టరీ నుంచి మంటలు వెలువడుతున్న దృశ్యాలు, స్థానిక ప్రజలు ఆందోళన చెందుతూ అటు ఇటు పరిగెడుతున్న దృశ్యాలను అందులో కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని థానే డొంబివాలిలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. అయితే, ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్న బాయిలర్ లో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు ధాటికి ప్యాక్టరీలో మంటలు చెలరేగాయి. పొగ కూడా భారీగా కమ్మేసింది. దీంతో పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. అయితే, భారీగా మంటలు ఎగిసిపడి అక్కడే ఉన్న మిగతా రెండు బిల్డింగ్ లకు కూడా వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కి నలుగురు మృతిచెందారు. 25 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.


ప్రమాదానికి సంబంధించిన విషయం స్థానికంగా ఉన్న ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అనంతరం 15 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పివేశారు. అయితే, ఆ మంటల్లో చిక్కుకున్న 8 మందిని పోలీసులు సురక్షితంగా రెస్య్కూ చేసి కాపాడారు. ఈ భారీ ప్రమాదంలో పలు వాహనాలు కూడా కాలిపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆ కంపెనీ పక్కనే ఉన్నటువంటి ఆ మంటల ధాటికి పలు ఇండ్లు పాక్షికంగా కాలిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం సంభవించడంతో ఆ కంపెనీ నుంచి భారీగా వెలువడుతున్న మంటలు, పొగలు.. భారీ ప్రమాదం సంభవించడంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఆందోళనకు గురవుతూ అటు ఇటు పరిగెడుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.

Also Read: పాఠశాలల వేసవి సెలవులు పొడిగింపు..?

కాగా, మహారాష్ట్రలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అకోలాలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధేవిధంగా భారీగా వేడిగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. ఎండలు అత్యధికంగా నమోదవడం, వేడిగాలులు వీయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న విషయం తెలిసిందే.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×