BigTV English

Hyderabad Hijras: హైదరాబాద్‌లో హిజ్రాల బీభత్సం.. బెంబేలెత్తుతున్న ప్రజలు, ఏం జరిగింది?

Hyderabad Hijras: హైదరాబాద్‌లో హిజ్రాల బీభత్సం.. బెంబేలెత్తుతున్న ప్రజలు, ఏం జరిగింది?

Hyderabad Hijras: హైదరాబాద్‌లో హిజ్రాల బీభత్సం అంతా ఇంతా కాదు. వాళ్లు అడిగినంత ఇవ్వాల్సిందే. ఒకవేళ కుదరదని చెబితే వాళ్లు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. సరిగ్గా అలాంటి ఘటన ఒకటి రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో చోటు చేసుకుంది. వారి ఆగడాలను ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. సీపీకి ట్యాగ్ చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.


హిజ్రాలు అంటే సొసైటీలో కాస్త గౌరవం ఉండేది. వాళ్ళు ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని భావిస్తారు. తిట్లు పడితే లేనిపోని ఇబ్బందులు వస్తాయని సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇంటి ముందు టెంట్ వేసినా, సన్నాయి సౌండ్ వచ్చినా వాహనాల మీద రయ్యిని ఆ ప్రాంతంలో వాలిపోతారు.

తొలుత ఒకరు వచ్చి లొకేషన్ పరిశీలించారు. ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేసినా, గృహ ప్రవేశం చేసినా, బర్త్ డే ఫంక్షన్లు జరిగినా అక్కడ వాలిపోతారు. ఫోన్ల ద్వారా లొకేషన్‌ను మిగతా వారికి షేర్ చేస్తారు. గుంపుగా వచ్చి అక్కడ నానారభస చేశారు.. చేస్తున్నారు కూడా.


అలాంటి ఘటన గుర్రంగూడలో చోటు చేసుకుంది. స్థలం కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఇల్లు కట్టుకునేందుకు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ విషయం హిజ్రాల చెవిలో పడింది. వెంటనే ఆటోలో కొందరు, వాహనాల్లో మరికొందరు వచ్చేశారు. ఈ ప్రాంతంలో ఇల్లు కడుతున్నారంటే మీ దగ్గర డబ్బు చాలా ఉంటుంది.. తాము అడిగినంత ఇవ్వాల్సిందే ఓనర్‌ని బెదిరించారు.

ALSO READ: హైదరాబాద్‌లో ఈకో టౌన్ షిప్, జపాన్‌తో కీలక ఒప్పందం

పూజా సామాగ్రిని డ్యామేజ్ చేశారు. ఈ తతంగాన్ని దూరంగా ఉన్న ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో షూట్ చేసి రాచకొండ సీపీకి ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయం వెంటనే ఆ ప్రాంత పోలీసుల వరకు వెళ్లింది. అక్కడికి చేరుకుని వారిని స్టేషన్ కు తరలించారు. ఆపై కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

హిజ్రాల వ్యవహారం ఒక్క గుర్రంగూడ ప్రాంతానికి పరిమితం కాలేదు. హైదరాబాద్ సిటీలో ఎక్కడైతే కొత్తగా నిర్మాణాలు జరుగుతాయో ఆ ప్రాంతంపై నిఘా వేస్తారు. తెల్లవారు జామున ఐదు నుంచి ఆరుగంటల సమయంలో ఓ హిజ్రా టూవీలర్‌పై చక్కర్లు కొడుతుంది. ఏమైనా సన్నాయి సౌండ్లు, టెంట్లు ఉంటే చాలు మిగతావారికి లోకేషన్ షేర్ చేస్తారు. తొలుత ఒక్కరు వస్తారు.. ఆ తర్వాత మిగతావారిని రప్పించి నానా హంగామా చేస్తుంటారు. వారు చేస్తున్న బీభత్సాన్ని చూడలేక ఆడవాళ్లు ఇంట్లోకి వెళ్లిన సందర్భాలు లేకపోలేదు.

చిన్నస్థాయి ఇల్లు గృహ ప్రవేశం చేస్తే 20 వేలకు పైగానే డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఏర్పాటు చేసిన పూజా సామాగ్రిని ధ్వంసం చేయడం, ఒంటిపై బట్టలు తీయడం వంటివి చేస్తుంటారు. ఏదైనా షాపు ఓపెనింగ్ చేసినా, ఐదు వేలు, 10 వేలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త ప్రాంతాల్లో హంగామా చేసే హిజ్రాలు ఇక్కడవారు కాదని, వారంతా నార్త్ నుంచి వచ్చారని కొందరు మాట. ఏవరైతే కొందరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఆయా ప్రాంతాలపై నిఘా వేయాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు.

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×