BigTV English
Advertisement

Lawrence Bishnoi Interview: జైల్లో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయి ఇంటర్‌వ్యూ.. 2 డిఎస్‌పీలు సహా 7 పోలీసు అధికారులు సస్పెండ్

Lawrence Bishnoi Interview: జైల్లో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయి ఇంటర్‌వ్యూ.. 2 డిఎస్‌పీలు సహా 7 పోలీసు అధికారులు సస్పెండ్

Lawrence Bishnoi Interview| దేశంలోనే టాప్ మోస్ట్ క్రిమినల్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి జైల్లో ఉండగా అతడిని ఇంటర్‌వ్యూ చేసేందుకు అనుమతి ఇచ్చినందుకు పంజాబ్ ప్రభుత్వం ఏడుగురు సీనియర్ పోలీసులు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో ఇద్దరు డెప్యూటి సూపరింటెండెంట్ (డిఎస్‌పి) ర్యాంక్ ఆఫీసర్లు, ఇద్దరు డెప్యూటి ఇన్‌స్పెక్టర్లు ఉండడం సంచలనంగా మారింది. వీరిని సస్పెండ్ చేస్తూ.. పంజాబ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.


పంజాబ్ లోని ప్రముఖ పాప్ సింగర్ సిద్దు మూసేవాలా, రాజస్థాన్ లోని రాజపుత్ కర్ణిసేన నాయకుడు సుఖ్ దేవ్ సింగ్ గోగామేడి లాంటి విఐపీల హత్యలతో పాటు డ్రగ్స్, ఆయుధాలు, హత్యల కేసులో నిందితుడైన లారెన్స్ బిష్ణోయి ప్రస్తుతం గుజరాత్ లోని సాబర్మతి జైల్లో ఉన్నాడు. అయితే అతడిని సెప్టెంబర్ 3 2022ర రహస్యంగా ఇంటర్‌వ్యూ చేశారని తాజాగా ఒక స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీమ్ బట్ట బయలు చేసింది. బిష్ణియో జైల్లో ఉండగా.. అతడిని ఇంటర్‌వ్యూ చేసేందుకు అనధికారికంగా పోలీసు అధికారులు అనుమతి ఇచ్చారని సిట్ విచారణలో వెల్లడైంది.

హై ర్యాంక్ పోలీస్ అధికారులు సస్పెండ్
జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ ని ఇంటర్‌వ్యూ చేసేందుకు అనుమతినిచ్చినందుకు ఇద్దరు డిఎస్‌పి అధికారులు గుర్షర్ సంధు, సమ్మర్ వనీత్ లపై సస్పెషన్ వేటు పడింది. వీరితోపాటు మరో అయిదు మంది పోలీసు అధికారులపై కూడా పంజామ్ హోమ్ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. బిష్ణోయి జైల్లో ఉన్నప్పుడు ఇంటర్‌వ్యూ చేసినా.. ఆ ఇంటర్‌వ్యూ వీడియో ఉత్తరాది రాష్ట్రాల్లో బహిరంగంగా ప్రసారం చేయడంతో ఈ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది.


జైలులో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ఒక ఖైదీగా ఉన్న గ్యాంగ్ స్టర్‌ని ఇంటర్‌వ్యూ చేయడంతో పంజాబ్ జైలు శాఖపై కూడా విచారణ జరుగుతోంది. అనుమతులు ఇచ్చినందుకు జైలు సిబ్బిందిపై అంతర్గతంగా విచారణ కూడా జరుగుతోందని సమాచారం.

Also Read: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు, సల్మాన్ కు అండగా పప్పు యాదవ్

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి ఇంటర్‌వ్యూ కేసులో పోలీసుల సస్పెషన్ గురించి పంజాబ్ హోం సెక్రటరీ గుర్‌కిరత్ కిర్పాల్ సింగ్ ఆదేశాలు జారీ చేస్తూ.. బాధ్యులైన పోలీసులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని పేర్కొన్నారు. హోం శాఖ జారీ చేసిన సస్పెన్షన్ ఆర్డర్ లో సబ్ ఇన్‌స్పెక్టర్లు రీనా, జగత్ పాల్ జంజు, షగన్ జీత్ సింగ్, చీఫ్ కానిస్టేబుల్ ఓం ప్రకాశ్, డెప్యూటి సూపరింటెండెంట్ అధికారులు గుర్షర్ సంధు, సమ్మర్ వనీత్ లు ఉన్నారు. సింగర్ సిద్దరూ మూసేవాలా హత్య కేసులో డిఎస్‌పి గుర్షర్ సంధు నేతృత్వంలోనే జరగడం ఆశ్చర్యకర విషయం. గ్యాంగ్‌స్టర్ బిష్యోయి తీహార్ జైలు నుంచి ఖరార్ సిఐఏ ఆధీనంలోకి వెళ్లినప్పుడు ఈ ఇంటర్‌వ్యూ జరగడం మరింత షాకింగ్ విషయం.

మరోవైపు లారెన్స్ బిష్ణోయి జైళ్లో ఉండగానే పోలీసు అధికారులను బెదిరించినట్లు సిట్ విచారణలో తేలింది. బిష్ణోయి 2023 మార్చి నెలలో భటిండా జైలులో ఉన్న సమయంలో రెండు సార్లు విచారణ ఎదుర్కొన్నాడు. ఈ విచారణ తరువాత సిట్ అధికారులు ఫిబ్రవరి 5 2024న క్రిమినల్ కాన్సిపిరెసీ, ఎక్స్ టార్షన్, పంజాబ్ ప్రిజన్ యాక్ట్ 2011 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుని సుప్రీం కోర్టు అక్టోబర్ 28ని వాయిదా వేసింది.

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ సభ్యులు కెనాడా, లండన్ దేశాల నుంచి గ్యాంగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ గ్యాంగ్ లో దాదాపు 700 మంది షూటర్లు ఉన్నట్లు సమాచారం.

Related News

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Big Stories

×