BigTV English

infosys layoff : 700 మంది ఉద్యోగుల తొలగింపు – బౌన్సర్లతో బయటకు నెట్టించిన ఇన్ఫోసిస్

infosys layoff : 700 మంది ఉద్యోగుల తొలగింపు – బౌన్సర్లతో బయటకు నెట్టించిన ఇన్ఫోసిస్

Infosys layoff : భారత్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా 700 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరంతా ఇటీవలే ఉద్యోగాలు పొందిన ప్రెషర్స్ అని ఐటీ ఎంప్లాయిస్ యూనియన్ వెల్లడించింది. వీరంతా మైసూర్ క్యాంపస్ కి చెందిన వారని తెలిపిన యూనియన్.. టెర్మినేట్ చేసిన ఉద్యోగులతో ఇన్ఫోసిస్ చాలా దురుసుగా వ్యవహరించిందని తెలిపింది. వారిని క్యాంపస్ నుంచి బయటకు
పంపేందుకు బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డుల్ని వినియోగించినట్లు ఆరోపించింది. వారితో టెర్మినేటుకు సంబంధించిన విషయాలు పంచుకోకుడదనే అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుందని అన్నారు.


ప్రస్తుతం ఉద్యోగాల నుంచి తొలగించిన వాళ్లంతా ఇటీవలే ఉద్యోగాలు సాధించిన ఫ్రెషర్లు అని తెలిపిన ఐటీ ఉద్యోగుల యూనియన్.. వీరిని రెండు, మూడు నెలలు మాత్రమే ఆన్ బోర్డుపై ఉంచి.. ఇప్పుడు ఒకేసారి తొలగించారని వెల్లడించారు. మైసూర్ క్యాంపస్ నుంచి తొలగించిన ఉద్యోగుల పట్ల సంస్థ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.. కనీస గౌరవం ఇవ్వకుండా అలా వ్యవహరించడం సరైంది కాదని అంటున్నారు.
పైగా.. టెర్మినేట్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో క్యాంపస్ లోకి ఉద్యోగులను ఎవరినీ మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లనివ్వలేదని చెప్పారు. దాంతో.. అక్కడ జరిగిన విషయాన్ని రికార్డు చేసేందుకు, బయట నుంచి సాయాన్ని కోరేందుకు వీలు లేకుండా పోయిందని తెలిపారు.

అయితే ఈ ఘటనపై స్పందించిన ఇన్ఫోసిస్ యాజమాన్యం.. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే అని స్పష్టం చేసింది. ప్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునే ముందే వారికి అనేక రకాల ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయని తెలుపుతామని, వాటిలో అర్హతలు సాధించలేకపోతే.. ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుందని చెప్పే విధుల్లోకి తీసుకుంటామని వెల్లడిస్తోంది. రిక్యూట్మెంట్ ప్రక్రియలో ఇంటర్నల్ అసెస్మెంట్ ఓ భాగమని తెలిపిన సంస్థ.. ఫ్రెషర్లను రిక్యూట్ చేసుకున్న తర్వాత నిర్వహించిన అనేక సామర్థ్య పరీక్షల్లో వాళ్లంతా ఫెయిలయ్యారని తెలిపింది. అందుకే.. వారిని నిబంధనల ప్రకారం సంస్థ నుంచి తొలగించినట్లు తెలిపింది.


Also Read : అవును.. ఆ ఎన్నికల్లో అవకతవకలు, 39 లక్షల కొత్త ఓటర్లు ఎలా చేరారు?

సంస్థ అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి శాశ్వత ప్రాతిపదికపై ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు ఇన్పోసిస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే.. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటీ ఉద్యోగుల యూనియన్.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర కార్మిక శాఖకు ఇన్ఫోసిస్ వ్యవహారాన్ని తీసుకెళ్లనున్నట్లు తెలిపిన యూనియన్.. వెంటనే ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని, ఉద్యోగుల భద్రతకు సాయంగా నిలవాలని కోరుతోంది. ఉద్యోగుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించే సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×