BigTV English

April Fool Day: ఏప్రిల్ ఫూల్ డే ఎలా వచ్చిందో తెలుసా..!

April Fool Day: ఏప్రిల్ ఫూల్ డే ఎలా వచ్చిందో తెలుసా..!
 The History Of April Fool Day
 

The History Of April Fool Day: ఏప్రిల్ 1వ తేదీ వచ్చిందంటే చాలు అందరికి భలే సరదాగా అనిపిస్తుంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఏవేవో చెప్పి అందరిని ఫూల్ చేస్తుంటారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజీ యవతీ యువకులు.. షూలేస్ ఊడిపోయిందనో, డ్రస్ పై ఏదో పడిందనో .. ఒకరిపై ఒకరు కట్టు కథలు చెప్పుకోవడం ఇలా అందరూ సరదాగా ప్రాంక్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎలా ఫూల్ చేయాలా అని చేస్తుంటే.. మరి కొంత మంది ఎలా తప్పించుకోవాలా అని చూస్తుంటారు.


మొత్తానికి ఏప్రిల్ 1వ తేది వచ్చిందంటే చాలు అందరికి ఓ ఎక్సైట్ మెంట్ గా భావిస్తుంటారు. ఎవరిని ఫూల్ చేయాలా అని చూస్తుంటారు. అయితే ఏప్రిల్ ఫూల్ డే ఎలా వచ్చింది. దీనిని సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణాలు ఎవరికైనా తెలుసా ! ఏప్రిల్ ఫూల్ అనేది 200 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి అందరూ దీనిని పాటిస్తారు అని నమ్మితే ఫూల్ అయనట్లే.. వాస్తవానికి ఇటలీలో రోమ్ చక్రవర్తి భార్య పేరు స్ప్రింగ్ ఏప్రిల్.. ఇది ఎలాగు స్ప్రింగ్ సీజన్ కాబట్టి.. ఆమె బర్త్ డే రోజున అందరూ సరదాగా నవ్వుతూ.. అందరిని నవ్విస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. అని ఎవరైనా చెబితే నమ్మారో మళ్లీ మీరు ఫూల్ అయినట్లే. ఇలాగా రకరకాలుగా కట్టు కథలతో ఏప్రిల్ 1న ఫూల్స్ చేస్తూ ఉంటారు.

Also Read:  ఆ విషయం తర్వాత.. రాజుగారు బయటికొచ్చారు


నిజానికి దీని వెనుక ఉన్న కారణం ఎవరికి క్లారిటీ లేదు. కాని కొన్ని రకాల కథనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1582 లో జూలియన్ క్యాలెండర్ పోయి జార్జియన్ క్యాలెండర్ అనుసరణలోకి వచ్చింది. జార్జియన్ క్యాలెండర్ లో జనవరి 1న నూతన సంవత్సరం ప్రారంభం కాగా.. జూలియన్ క్యాలెండర్ లో ఏప్రిల్ 1న నూతన సంవత్సరం ప్రారంభం అవుతున్నట్లు ఉంది. దీంతో కొత్త క్యాలెండర్ కి అలవాటు పడని వారు ఏప్రిల్ 1నే న్యూయర్ వేడుకలు జరుపుకునే వారట. ఇక అలాంటి వారిని చూసి ఏప్రిల్ ఫూల్ అని ఎగతాళి చేస్తూ నవ్వుకునేవారట.

భారత్ లో ఇది బ్రిటీష్ పాలనలో (19 వ శతాబ్ధం) ప్రాచుర్యంలోకి వచ్చింది. మరొక కథనానికి వస్తే.. ఏప్రిల్ 1న రోమన్ పండుగ హిలేరియాని జరుపుకుంటారు. హిలేరియా అనే పదానికి అర్ధం ఆనందంగా లేదా ఉల్లాసంగా ఉండటం. ఈ పండుగలో ఒకరినొకరు హేళన చేసుకుంటారు. దీంతో ఆరోజు ఫూల్ డే గా జరుపుకునేవారట. ఏదేమైనా సరదాగా నవ్వుకోవడానికి. నవ్వించడానికి ఒకరోజు ఉందని కొంతమంది భావిస్తుంటారు. మరికొంత మంది మనం చూసే వన్ని నిజాలు కాదు వినేవన్ని వాస్తవాలు కాదు అని చెబుతారు.

Tags

Related News

Viksit Bharat Rozgaar Yojna: యువత కోసం కేంద్రం కొత్త స్కీమ్.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రకటన

Independence Day 2025: ఎర్రకోటపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సోషల్ మీడియాపై దృష్టి

Jammu Kashmir cloudburst: జమ్మూ కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. 38 మంది మృతి.. 200 మంది గల్లంతు!

Dog population: వీధి కుక్కలు ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని?

Himachal floods: హిమాచల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వంతెనలు

Delhi Rains: దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Big Stories

×