Monkey Drinks Vodka: వీకెండ్ వచ్చిందంటే మనుషులే కాదు.. జంతువులు ఎంజాయ్ చేస్తుంటాయి. అందుకు ఎగ్జాంపుల్ పైన ఫోటోలో కనిపిస్తున్న మంకీ. ఇదేంటి అనుకుంటున్నారా? వీకెండ్ కావడంతో ఓ లిక్కర్ షాపులోకి వెళ్లి వోడ్కా తాగి హాయిగా నిద్రపోయింది.
కోతులు వాటి అల్లరి చేష్టలకు చాలా మంది ఫిదా అవుతారు. ఉన్నవారి ప్రవర్తనను గమనించి కొన్నిసార్లు అనుకరించిన సందర్భాలు ఉన్నాయి. మొబైల్ ఫోన్లు, హ్యాండ్‌బ్యాగులు, ఆహారాన్ని లాక్కోవడం, కోతులు సిగరెట్లను పట్టుకున్నట్లు కనిపించే వీడియోలు ఇంటర్నెట్‌లో సంచలనాలుగా మారుతున్నాయి. తాజాగా ఓ కోతి మద్యం తాగుతూ కనిపించి. ఆ తర్వాత మద్యం షాపు లోపల హాయిగా రెస్టు తీసుకున్న సన్నివేశం ఎప్పుడైనా చూశారా?
జార్ఖండ్‌లోని రాంచీ జిల్లా ఓర్మాన్‌ఝీ ప్రాంతంలోని ఓ మద్యం షాపులో వింత సంఘటన చోటు చేసుకుంది. బ్లాక్ చౌక్‌లోని మద్యం షాపులోకి గర్భవతి కోతి అనుకోకుండా ప్రవేశించింది. ఆవరణలో చుట్టూ తిరగడం ప్రారంభించింది. దుకాణంలోని సిబ్బంది కోతిని తరిమి వేయడానికి ప్రయత్నించారు. దాని దృష్టి మరల్చడానికి బిస్కెట్లు ఇచ్చారు. ఇవేమీ చేసినా ఆ కోతి అక్కడి నుంచి వెనక్కి తగ్గలేదు. చివరకు మద్యం సీసాను పట్టుకోవడం ఊహించని మలుపు తీసుకుంది.
రాత్రి కాగానే షాపు ఓవర్ క్లోజ్ చేసి వెళ్లిపోయాడు. అందులో ఉన్న కోతి, వోడ్కా లిక్కర్ సీసా మూత తెరిచి అందులోని మద్యం అంతా తాగేసింది. ఫుల్‌గా మత్తు ఎక్కేయడంతో లోపల హాయిగా నిద్రపోయింది. అది కూడా లిక్కర్ బాక్సులో హాయిగా నిద్రపోయింది. శనివారం ఉదయం షాపు ఓపెన్ చేసిన షాపు ఓనర్, ఆ సన్నివేశాన్ని షాకయ్యాడు. షాపు అంతా వెతుకుతుండగా మూత లేని వోడ్కా బాటిల్ కలిపింది. ఇక కోతి స్పృహ లేకుండా గాఢమైన నిద్రలోకి చేరుకుంది. ఈ సన్నివేశాన్ని తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రెగ్నెంట్‌తో కోతి విషయాన్ని రెస్క్యూ టీమ్‌కి సమాచారం ఇచ్చారు షాపు ఓనర్. ఆ బృందం అక్కడికి చేరుకుని ఆ కోతిని దుకాణం నుండి సురక్షితంగా తీసుకెళ్లారు. ఊహించని అతిథిని సురక్షితంగా బయటపడింది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారి ఆలోచనకు తగ్గట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. నేను మద్యం బాటిల్ ఖాళీ చేశాను అనే మాటను సీరియస్‌గా కోతి చెప్పిందని ఓ వ్యక్తి కామెంట్స్ చేశాడు. పబ్‌లన్నీ పుల్ కావడంతో మంకీ ఏకంగా మద్యం షాపులో ఎంజాయ్ చేసిందని మరికొందరు చెబుతున్నారు.
VERY UNUSUAL! A monkey entered a wine 🍷shop in Ranchi’s Ormanjhi, allegedly drank alcohol from a bottle and then fell asleep inside the shop 😴
A rescue team arrived and safely removed the unexpected customer. 🐒 pic.twitter.com/Z6xs3vVNGb
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 26, 2026