Road Accident: అతి వేగం ప్రమాదకరం.. కానీ కొన్ని ప్రమాదాలు అనుకోకుండా జరిగిన సందర్భాలు కోకొల్లలు. ఎందుకంటే వాహనం వెళ్లే క్రమంలో టైర్ పేలిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఘటన ఓ ఎమ్మెల్యేకు ఎదురైంది. ఆ ఘటన యూపీలోని వెలుగులోకి చూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చంద్రపాల్‌సింగ్ లోధి.. గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆయన ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వాహనం టైరు పగిలిపోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని నేరుగా ఢీకొట్టింది. ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు హాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. అందులో కారు హైవేపై అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు కనిపిస్తోంది. చంద్రపాల్‌సింగ్ దిబాయి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రమాదానికి ఈ ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందంటే అసలు ఎవరూ ఊహించని విధంగా చోటు చేసుకుంది. లక్నో నుంచి తిరిగి వస్తుండగా పోటా కాబుల్‌పూర్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సంఘటన జరిగిన ప్రదేశం, ఎక్స్‌ప్రెస్‌వే గురించి ప్రాథమిక నివేదికలు వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌వేపై కారు టైరు అకస్మాత్తుగా పగిలిపోవడం వెనుక వర్షపు నీరు కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారు వేగంగా రోడ్డు నుండి మట్టి దారిలోకి జారి చివరకు ఓ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఆ ప్రమాదం ఎంత ప్రమాదకరంగా ఉందంటే, ఇలాంటివి చూస్తే ఎవరైనా భయపడటం సహజమే. కొద్ది రోజులుగా యూపీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉన్నావ్‌లోని సోనిక్ టోల్ ప్లాజాతోపాటు గంగా ఎక్స్‌ప్రెస్‌వే పొడవునా పలుచోట్ల నీరు నిలిచిపోయింది.
ALSO READ: వివాదంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్.. ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే.. ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!
కొన్ని ప్రాంతాలలో నీరు సుమారు 5 నుంచి 6 అడుగుల వరకు నిలిచిపోయింది. టోల్ క్యాబిన్‌లు పూర్తిగా నీట మునిగిపోయాయి. సర్వీస్ రోడ్డుపై ఉన్న ఒక ట్రైలర్ ట్రక్కు నిలిచిపోయిన నీటిలో చిక్కుకుపోయింది. ఇంజన్‌లోకి నీరు చేరడంతో ఆ వాహనం దెబ్బతింది. ఎక్స్‌ప్రెస్‌వే బాధ్యత వహించే సదరు ఏజెన్సీ.. నీటిని బయటకు పంపేందుకు మూడు జనరేటర్లను మోహరించింది. టోల్ ప్లాజా నుండి వచ్చే నీటిని మళ్లించేందుకు వీలుగా సర్వీస్ రోడ్డు సమీపంలో ఒక గుంతను తవ్వేందుకు జేసీబీని కూడా తీసుకువచ్చారు.
ఎమ్మెల్యే కారుకు ఘోర ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చంద్రపాల్ సింగ్ లోధి ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారు గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదానికి గురైంది. గంటకు 120 కిమీ వేగంతో వెళ్తుండగా ముందు టైరు పేలిపోవడంతో కారు స్కిడ్ అయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ… pic.twitter.com/vppO5IFKml
— BigTV APP (@BigtvApp) September 26, 2026