BigTV English

Chandigarh Mayoral Poll: సుప్రీం సంచలన తీర్పు.. చండీగఢ్‌ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి విజేతగా ప్రకటన

Chandigarh Mayoral Poll: సుప్రీం సంచలన తీర్పు.. చండీగఢ్‌ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి విజేతగా ప్రకటన
Chandigarh Mayoral Poll

Aap won the Chandigarh Mayoral Poll: చంఢీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆప్ అభ్యర్థి కుల్ దీప్ కుమార్ ను విజేతగా ప్రకటించింది. సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటింగ్ నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు ఆప్ ఆనందం వ్యక్తం చేసింది.


సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీ కుటిల ప్రయత్నం బయటపడిందని పేర్కొంది. ఒక మేయర్ పదవి కోసం కేంద్రం, బీజేపీ వ్యవహరించిన తీరుపై మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు కాపాడిందంటూ ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై వివాదం నడుస్తోంది. ఎన్నికపై అక్రమాలు జరిగాయని ఆప్ ఆరోపించింది. ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం ఆ రోజు నిర్వహించిన మేయర్ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి తీరును తప్పుపట్టింది. బ్యాలెట్ పత్రాలను తారుమారు ఘటనను ప్రస్తావించింది.


Read More: రాజ్యసభకు సోనియా గాంధీ, జేపీ నడ్డా.. ఏకగ్రీవంగా ఎన్నిక..

ఉద్దేశపూర్వంగానే రిటర్నింగ్ అధికారి అలా చేశారనేది స్పష్టంగా తెలుస్తోందని సుప్రీంకోర్టు తేల్చేసింది. రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలెట్ పేపర్లను సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. మేయర్ ఎన్నిక సమయంలో చేపట్టిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీడియోను న్యాయమూర్తులు వీక్షించారు. చివరికి ఎన్నికలో అక్రమాలు జరిగియాని సుప్రీంకోర్టు నిర్ధారించింది.

జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నిక జరిగింది. మేయర్ ఎన్నికలో విజయం సాధించాలంటే 20 మంది కౌన్సిలర్ల మద్దతు కావాలి. కానీ బీజేపీ 16 మంది సభ్యులే ఉన్నారు. అయినప్పటీ ఆ పార్టీ అభ్యర్థి మనోజ్ సోంకర్ ను విజేతగా ఎన్నికల రిట్నరింగ్ అధికారి ప్రకటించారు. ఆప్‌-కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి కుల్ దీప్ కుమార్‌ ఓడిపోయినట్లు వెల్లడించారు.

మేయర్ ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని ఆరోపిస్తూ ఆప్‌ కౌన్సిలర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న న్యాయస్థానం అన్ని అంశాలను పరిశీలించి చివరికి ఆప్ అభ్యర్థి కుల్ దీప్ కుమార్ ను చంఢీగఢ్ మేయర్ గా ప్రకటించింది.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×