BigTV English

Rajya Sabha: రాజ్యసభకు సోనియా గాంధీ, జేపీ నడ్డా.. ఏకగ్రీవంగా ఎన్నిక..

Rajya Sabha: రాజ్యసభకు సోనియా గాంధీ, జేపీ నడ్డా.. ఏకగ్రీవంగా ఎన్నిక..

Sonia Gandhi JP Nadda elected Unanimously To Rajya Sabha: గుజరాత్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవింద్‌భాయ్ ధోలాకియా, పార్టీ నేతలు జస్వంత్‌సింగ్ పర్మార్, మయాంక్ నాయక్‌లు బీజేపీ నుంచి గెలుపొందారు.


రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు వారు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి తేదీ. గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాలకు గాను 111 సీట్లతో బీజేపీ మెజారిటీ దక్కించుకుంది. కాంగ్రెస్‌ 65 స్థానలకే పరిమితమైంది.

Read More: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం .. ప్రారంభించిన ప్రధాని మోదీ..


మంగళవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు అభ్యర్థుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉన్నారు. మిగిలిన ఇద్దరు బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ అని అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ తెలిపారు.

రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్‌ నుంచి మన్మోహన్ సింగ్, బీజేపీ నుంచి భూపేంద్ర యాదవ్ పదవీకాలం ఏప్రిల్ 3తో ముగుస్తున్నందున రాష్ట్రంలోని మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో 10 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, వీటిలో ఇప్పుడు ఆరు కాంగ్రెస్, నాలుగు బీజేపీ ఆధీనంలో ఉన్నాయి.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×