E-Paper
Advertisement

ఓవైపు ఎన్నికలపై ఆరోపణలు.. ఇంకోవైపు పోటీ.. విపక్షాల తీరుపై సీజేపీ చీఫ్ ఆశ్చర్యం!

ఓవైపు ఎన్నికలపై ఆరోపణలు.. ఇంకోవైపు పోటీ.. విపక్షాల తీరుపై సీజేపీ చీఫ్ ఆశ్చర్యం!
Advertisement

Abhijit Dipke: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తొలిసారి విపక్షాలను తప్పుబట్టారు. ఎన్నికల తీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అదే ఎలక్షన్స్ బరిలో నిలబడటం ఏంటని ప్రశ్నించారు. ఒకవైపు వ్యవస్థలు మేనేజ్ అవుతున్నాయని చెబుతూ.. ఇంకోవైపు పోటీకి సై అనడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ రకమైన వైఖరి వల్ల ఎన్నికలు పారదర్శకంగానే జరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మ్యాచ్ ఫిక్సింగ్ జరిగితే ఆడడం ఎందుకు?

సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఓట్ల దొంగతనానికి సహకరించారంటూ గురువారం రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విపక్షాలకు తమ రాజకీయ మనుగడ ముఖ్యమా? లేక అక్రమాలపై నిలబడడం ముఖ్యమా? తేల్చుకోవాలని సూచించారు. ‘ఆట అంతా ఫిక్సింగ్ అని చెబుతూనే, మళ్లీ అదే ఆటలో పాల్గొంటామనడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. గెలిచిన ప్రజాప్రతినిధులను చేర్చుకోవడం, పార్టీలను చీల్చడం వంటివి జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థలో కొనసాగడం వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నారు. ఇది నిజమైన రాజకీయ మనుగడ కాదన్నారు. బలహీనపరిచే వ్యవస్థలో కేవలం ఉనికి కోసం విపక్షాలు పడుతున్న తాపత్రయమేనని పేర్కొన్నారు.

‘అన్ని రాష్ట్రాల్లో ఒకటే మాట’

Advertisement

ఎన్నికల నిర్వహణపై విపక్షాలు ద్వంద్వ వైఖరిని విడనాడాలని దిప్కే హితవు పలికారు. కేవలం తమకు నష్టం జరిగే రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా ఒకే రకమైన స్టాండ్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఎన్నికలు తప్పుగా జరుగుతుంటే, అది ఏ రాష్ట్రంలో జరిగినా, ఏ పార్టీకి నష్టం జరిగినా ప్రశ్నించాల్సిందేనన్నారు. ఫిక్సింగ్ అయిన మ్యాచ్‌లలో కూడా కొన్నిసార్లు ప్రత్యర్థికి కొన్ని విజయాలు దక్కుతాయని అది పోటీ నిజంగానే జరుగుతోందనే భ్రమను కలిగిస్తుందని ఉదాహరణగా చెప్పారు.

Also Read: పైసా ఖర్చు లేకుండా.. ఫుడ్ ఆర్డర్ చేసే కిక్.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న వింత వెబ్ సైట్!

ఈసీఈ రాజీనామాకు డిమాండ్

Advertisement

ఇదిలా ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని గురువారమే అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ప్రత్యేక తనిఖీ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియలో భాగంగా దాదాపు 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను డ్రాఫ్ట్ రోల్స్ నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. ఈ ఓట్ల తొలగింపు వల్ల అనేక రాష్ట్రాల్లో విపక్ష నేతలు దెబ్బతిన్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయని ఎలా చెప్పగలమని ఆయన ప్రశ్నించారు. అటు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరిపించాలని.. ప్రస్తుతం జరుగుతున్న ఎస్.ఐ.ఆర్ ప్రక్రియతో పాటు రాబోయే ఎన్నికలను కూడా వెంటనే నిలిపివేయాలని దీప్కే పట్టుబట్టారు.

Also Read: ఖైరతాబాద్ ఉపఎన్నిక.. రంగంలోకి కాంగ్రెస్ అధిష్టానం.. దానం ప్రభావంపై ఆరా!

Tags

Related News

‘సీఈసీ జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి.. తక్షణమే రాజీనామా చేయాలి’.. రాహుల్ సంచలన డిమాండ్!

జ్ఞానేష్ గేట్ నిజంగానే స్కామా? 13 కోట్ల ఓట్ల తొలగింపు వెనుక అసలేం జరిగింది?

వీరమణి పోక్సో కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఫోన్‌లో విస్తుపోయే వీడియోలు.. కీలక అనుచరుడు అరెస్ట్!

48 గంటల్లో CEC రాజీనామా చేయాలి.. లేకపోతే నిరసనలు: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

Big Stories

Advertisement
×