Minister Caught: రాజకీయ నేతలు రూటు మార్చారా? నిత్యం ప్రజా సమస్యలతో తీరిక లేకుండా గడుపుతున్నారా? అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సమయం దొరుకుతుందా? గడిపిన కొద్ది క్షణాల్లో తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లకు పని చెబుతున్నారా? తాజాగా అసెంబ్లీలో ఓ మంత్రి రమ్మీ గేమ్ అడుతూ అడ్డంగా కెమెరా చిక్కారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏంటి? ఎక్కడ అనేది చూద్దాం.
అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై చర్చ జరుగుతాయి. లేకుంటే అధికార పార్టీని ఓ ఆటాడుకుంటుంది ప్రతిపక్షం. ఆయా శాఖల గురించి ఏ చిన్న సమచారం దొరికినా ఆయా మంత్రులకు ఇబ్బందులు తప్పవు. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. రైతుల ఆత్మహత్యలపై చర్చ జరుగుతోంది.
ఈ విషయంలో సదరు వ్యవసాయశాఖ మంత్రి మాణిక్ రావ్ కోకటే ఏమనుకున్నారో తెలీదు. తీరిగ్గా తన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి రమ్మీ ఆడుకుంటూ కనిపించారు. జాకీ కోసం ఆయన తెగ వెతుకులాట మొదలుపెట్టారు. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యే ఒకరు వీడియో షూట్ చేసి విపక్షాలకు అందజేశారు. సదరు మంత్రిని ఆటాడుకోవడం విపక్షాల వంతైంది.
శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ రోహిత్ పవార్ సదరు మంత్రిపై మండిపడ్డారు. అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి మాణిక్ రావ్ కోకటే రమ్మీ ఆడుతున్న వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రైతాంగం తీవ్ర ఇబ్బందులో ఉందని, సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం మొగ్గుచూపడం లేదని ఆరోపించారు.
ALSO READ: ఉపవాసమున్న భార్యను కొట్టిన యువకుడు, కట్ చేస్తే ఇంట్లో అతని శవం
పంట బీమా కోసం, రుణ మాఫీ కోసం, పంటలకు మద్దతు ధర కోసం రైతులు పోరాడుతున్నారని, ఈవిషయాలేమీ పట్టకుండా సదరు మంత్రి తీరిగ్గా రమ్మీ ఆడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అప్పులపాలైన రైతులు రోజుకి ఎనిమిది మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్సీపీ నేత రోహిత్ పవార్.
వ్యవసాయ మంత్రికి చీమ కుట్టినట్లు లేదన్నారు. రమ్మీ ఆటను పక్కన పెట్టి అప్పుడప్పుడు రైతుల వద్దకు వచ్చిన సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. మంత్రి రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అన్నట్లు చాన్నాళ్ల కిందట కర్ణాటక అసెంబ్లీలో ఏకాంతం వీడియోలు చూస్తూ కెమెరాకి చిక్కారు ఓ ఎమ్మెల్యే. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ వేదికైంది.
“#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”
सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.
रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq
— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025