Air India Bomb Threat| ఇటీవల విమానాల్లో బాంబులున్నట్లు బెదిరింపులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ బెదిరింపులు ఫోన్ కాల్స్ లేదా ఈ మెయిల్స్ రూపంలో వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపు వచ్చింది. విమానం గాల్లో ఉండగానే ఈ బెదిరిపులు రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నాలుగు గంటలపాటు ప్రయాణం చేసిన తరువాత ఈ బెదిరింపు రావడంతో పైలట్లు తిరిగి బయలు దేరిన స్థానానికి మళ్లించారు. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఈ విమానాన్ని పైలట్లు టేకాఫ్ అయినచోటే దింపారు (Mumbai-New York). జాతీయ మీడియా కథనాల ప్రకారం..
బోయింగ్ 777 విమానం ముంబై నుంచి న్యూయార్క్ వెళుతోంది. నాలుగు గంటల తర్వాత అజర్‌బైజాన్ ప్రాంతంలో ఆకాశంలో ఉండగా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు (Bomb threat) వచ్చాయి. సిబ్బందికి ఈ బెదిరింపులు రావడంతో.. వెంటనే అప్రమత్తమైన పైలట్లు తిరిగి ముంబై వైపు విమానాన్ని మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే విమానంలో బాంబు ఎక్కడుందో కనిపెట్టడానికి బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి.. తనిఖీలు చేపట్టింది. అయితే బాంబు లాంటిదేమీ లేదని ఎవరో నకిలీ కాల్ చేశారని అని తెలుస్తోంది.
Also Read: మహిళలు ఒక హత్య చేసినా శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్య
గోవా నుంచి వస్తున్న విమాన సర్వీస్కు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో ఎయిర్ లైన్స్ 6E-6973 విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ మీదుగా విశాఖపట్నంకు బయలుదేరింది. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ విమానం హైడ్రాలిక్ గేర్‌ను సిద్ధం చేశాడు.
రన్వేపై టేకాఫ్ అవుతున్న మరో విమానం
విమాన సర్వీస్ను డౌన్ చేసిన పైలట్ అప్పటికే రన్వేపై టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించాడు. దీంతో వెంటనే అప్రమత్తమై విమానాన్ని గాల్లోకి లేపాడు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. 10 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం విమానాన్ని ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ విమాన సర్వీస్ విశాఖపట్నంనకు వెళ్లిపోయింది.