Air India ‘pee Gate’: ఎయిర్ ఇండియా విమానంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం ఓ వ్యక్తి, సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. మద్యం మత్తులో ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది. ఈ యవ్వారంపై పౌర విమానయాన శాఖ స్పందించింది. విమానంలో తప్పు చేసిన వ్యక్తిపై చర్చలు తీసుకుంటామని తెలిపింది.
ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు విమానం లోపల నానాహంగామా చేస్తున్నారు. మానసిక ప్రశాంతత లేక, మరేదైనా సమస్యా అనేది తెలీదు. మద్యం ఫుల్‌గా తీసుకుని విమానం ఎక్కుతున్నారు. మద్యం మత్తులో నానా రభస చేస్తున్నారు. ఈ తరహా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది.
అసలేం జరిగింది?
ఏప్రిల్ 9న అంటే బుధవారం ఢిల్లీ నుంచి బ్యాంకాక్ ఏఐ2336 విమానం వెళ్తోంది. మద్యం మత్తులో ఒక ట్రావెలర్, సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనపై ఎయిరిండియా ఒక ప్రకటన చేసింది. ఈ ఘటనకు పాల్పడిన ఆ వ్యక్తిని నెల రోజులపాటు నిషేధిత జాబితాలో పెట్టేసింది. బ్యాంకాక్‌లో ల్యాండింగ్ తర్వాత అధికారులకు ఫిర్యాదు చేయాలని సదరు ప్రయాణికుడికి సిబ్బంది సూచన చేారు. అయితే బాధిత ప్రయాణికుడు నిరాకరించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రియాక్ట్ అయ్యారు. దీనిపై ఎయిర్ లైన్స్‌తో చర్చిస్తామన్నారు. తప్పు చేసిన వ్యక్తిపై చర్యలు తప్పవన్నారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తి ఎంఎన్‌సీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అని తెలుస్తోంది. ఈ క్రమంలో బాధితుడు ఫిర్యాదు చేయలేదని కొందరు ట్రావెలర్స్ చెబుతున్నారు.
ALSO READ: కేంద్రమంత్రి మనవరాలు దారుణ హత్య, హంతకుడు ఎవరో తెలుసా?
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా క్లారిఫికేషన్ ఇచ్చింది. పైన చెప్పిన విధంగా ప్రవర్తించిన ప్రయాణికుడ్ని హెచ్చరించింది. అంతేకాదు బాధిత ప్రయాణికుడికి బ్యాంకాక్‌లో ఫిర్యాదు చేయడానికి మా సిబ్బంది ముందుకొచ్చారు. ప్రయాణికుడిపై తీసుకోవలసిన చర్యలను నిర్ణయించడానికి కమిటీని సమావేశం అవుతుందన్నారు. ఇలాంటి విషయాల్లో డీజీసీఏ నిర్దేశించిన విధానాలను ఎయిర్ ఇండియా అనుసరిస్తోందని తెలిపింది.
గతంలో కూడా
ఎయిరిండియా విమానంలో జరిగిన మూత్ర విసర్జన ఘటనతో మరికొన్నిఉన్నాయి. సరిగ్గా మూడేళ్ల కిందట ముంబైకి చెందిన శంకర్ మిశ్రా న్యూయార్క్ నుంచి ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన తర్వాత నిందితుడిని అరెస్టు అయ్యాడు. మిశ్రాను పని చేసిన వెల్స్ ఫార్గో కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది.
కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న ఎంఎన్‌సీ కంపెనీలో ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఈ ఘటన తర్వాత ఆ విమానయాన సంస్థ ప్రయాణికుడ్ని నెలరోజులపాటు విమానంలో ప్రయాణించకుండా నిషేధించిన విషయం తెల్సిందే. ఇది కాకుండా 2023 జనవరిలో మిశ్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.