విమాన ప్రమాదంపై త్వరలో వీడనున్న మిస్టరీ!
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై త్వరలోనే మిస్టరీ వీడనుంది. ఇప్పటికే బ్లాక్ బాక్స్, డీవీఆర్ స్వాధీనం చేసుకున్న డీజీసీఏ.. బ్లాక్ బాక్స్ డేటాని విశ్లేషిస్తోంది. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ బాక్స్‌లోని డేటాపైనే సర్వత్ర ఆసక్తి నెలకొంది. అసలు అందులో ఏం రికాక్డ్ అయ్యిందోనన్నదే ఉత్కంఠ రేపుతోంది.
బ్లాక్ బాక్స్ డేటాని విశ్లేషిస్తున్న డీజీసీఏ
ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్, డీవీఆర్ స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై.. డీజీసీఏ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ఇతర శాంపిల్స్‌ని కూడా ఫోరెన్సిక్ టీమ్ సేకరించింది. ప్రమాదానికి గల అసలు కారణమేంటన్నది.. త్వరలోనే తేలనుంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులేంటి? విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి కూలిపోయి.. పేలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఫ్లైట్‌లో ఏం జరిగిందనే విషయాలన్నీ.. త్వరలోనే బయటకు రానున్నాయి. ఈ వివరాలన్నీ.. బ్లాక్ బాక్స్‌లోనే ఉన్నాయి.
ప్రమాదానికి గల అసలు కారణాలు తెలిసే చాన్స్
విమాన ప్రమాదానికి అసలు కారణాలు ఏంటనేది ఇంకా తెలియలేదు. ప్రమాదానికి ఇవేనంటూ రకరకల అంచనాలు, విశ్లేషణలు వస్తున్నప్పటికీ అవేమీనిజం కాదు. విమాన ప్రమాద దర్యాప్తులో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్‌ను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే స్పష్టత వస్తుంది. ప్రమాదం స్థలంలో తొలి రోజు అన్వేషించినా లభ్యం కాని బ్లాక్ బాక్స్ శుక్రవారం దొరికింది. మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ రూఫ్‌టాప్‌పై దీనిని గుర్తించారు.
బ్లాక్ బాక్స్‌లోని డేటాపైనే సర్వత్ర ఆసక్తి
ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. విమానం ప్రయాణించిన వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరుతో పాటు కాక్ పిట్ ఆడియో లాంటి కీలకమైన సమాచారం దీనిలో రికార్డ్ అవుతుంది. పైలెట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య కమ్యునినేషన్ కూడా రికార్డ్ అవుతుంది. తీవ్రవైన ఉష్ణోగ్రతలో కూడా ఈ బాక్సులో చెక్కు చెదరదు. సో ఫైనల్నీ ఏం జరిగింది. ఎలా జరిగింది..? కారణాలు ఏంటో అన్ని ఈ బ్లాక్స్ బాక్స్ సిక్రెట్‌పైనే ఆధారపడి ఉంది.
ప్రమాదానికి గల అసలు కారణాలు తెలిసే అవకాశం
మరోవైపు.. విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాద స్థలం నుంచి వెలికితీసిన మృతదేహాలకు.. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో.. డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే.. కొందరికి డీఎన్ఏ టెస్టులు చేసి.. వారి కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో.. మృతుల సంఖ్య 269కి చేరింది. చికిత్స తీసుకుంటున్న మరో నలుగురు బీజే మెడికల్ కాజేలీ విద్యార్థులు మృతి చెందారు. 24 గంటలు గడిచినా.. మరో మెడికో ఆచూకీ లభించలేదు. మెడికల్ కాలేజీలో చనిపోయిన వారి సంఖ్య 28కి చేరింది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా.. ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ భారీ ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డానో కూడా తనకు తెలియదని చెబుతున్నాడు. తాను కూర్చున్న 11ఏ సీటు గాల్లో ఎగిరి పక్కకు పడిపోవడం వల్లే.. తాను బతికానని చెప్పాడు.
తనిఖీ చేయాలని DGCA కీలక నిర్ణయం
ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం మిగిల్చిన విషాదాన్ని చూశాక.. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై DGCA దృష్టి పెట్టింది. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ విమానాలన్నింటిని తనిఖీ చేయాలని నిర్ణయించింది. బోయింగ్ విమానాలు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని DGCA ఆదేశించింది. విమానాలు బయలుదేరే ముందు ఇంజన్లు పరిశీలించాలని కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. భారత ప్రభుత్వం కూడా బోయింగ్ ఫ్లైట్లపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ విమానాలను భారత్‌లో నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటికి సేఫ్టీ రివ్యూ నిర్వహించేందుకు అమెరికా ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా.. బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.
Also Read: మళ్లీ వార్!! ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవేంటి? ఆ ప్రాంతాలే ఇజ్రాయెల్ టార్గెట్