BigTV English

Plane crash: విమాన ప్రమాదంలో నర్సు మృతి.. రెవిన్యూ ఆఫీసర్ అనుచిత పోస్ట్.. చివరకు?

Plane crash: విమాన ప్రమాదంలో నర్సు మృతి.. రెవిన్యూ ఆఫీసర్ అనుచిత పోస్ట్.. చివరకు?

Plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 279 మంది ప్రాణాలు విషయం అందరికీ తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉండగా అందులో 241 మంది స్పాట్‌లో చనిపోయారు. ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే చనిపోయిన వారిలో కేరళకు చెందిన ఓ నర్సు కూడా ఉన్నారు. ఆమె పేరు రంజితా నాయర్. అయితే ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న రంజితా నాయర్ విమాన ప్రమాదంలో చనిపోగా.. ఓ రెవిన్యూ అధికారి సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టారు.  ఈమె గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆమెకు తగిన శాస్తి జరిగిందని సంచలన పోస్ట్ చేశారు.


పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన 42 ఏళ్ల రంజితా నాయర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే రంజితా నాయర్ తన తల్లిని కూడా చూసుకుంటున్నారు. తల్లిని తనతో పాటు ఉంచుకుంటుంది. అయితే వీరికి ఇప్పటి వరకు సొంత ఇల్లును కూడా నిర్మించుకోలేదు. దీంతో తన తల్లి, పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని భావించింది. ఇందుకోస కష్టపడటానికి ఆమె సిద్ధం అయ్యింది. తాను చేసేది గవర్నమెంట్ ఉద్యోగమే అయినా ఆ జీతం చాలకపోవడంతో విదేశాల్లో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది.

ALSO READ: Harish Rao: హరీష్ రావుకు అస్వస్థత.. ఇది ఆయన ప్రస్తుత పరిస్థితి..


ఆమెకు తెలిసిన స్నేహితుల సాయంతో ఆమె అనుకున్నట్టు బ్రిటన్‌లో జాబ్ సాధించింది. దీంతో ఆమె చేసే ప్రభుత్వ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టింది. పిల్లలను తల్లి వద్దే ఉంచి.. వారందరి బాధ్యతను భర్తకు అప్పగించింది.  ఈ క్రమంలోనే రంజిత బ్రిటన్ వెళ్లిపోయారు. ప్రతి నెలా ఆమెకు వచ్చే జీతాన్ని పంపిస్తూ.. ఇంటిని నిర్మించుకునే పనిలో ఉన్నారు. అయితే ఇటీవలే ఇంటి పనుల నిమిత్తం ఆమె సొంత ఊరికి తిరిగి రావాల్సి వచ్చింది. అందుకోసం ఆమె కేవలం 5 రోజులు మాత్రమే సెలవు పెట్టుకుని ఇంటికి వచ్చారు. ఇక సెలవులు ముగియడంతో అహ్మదాబాద్ విమానంలో ఎక్కి బ్రిటన్‌కు పయనమయ్యారు. ఇంతలోనే ప్రమాదం జరగడం.. ఆమె మృతిచెందడం జరిగిపోయింది. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ALSO READ: Weather News: రాష్ట్రంలో రేపు భారీ వర్షం.. ఈ 13 జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్

ఈ విషయం తెలుసుకున్న వెల్లరికుండు రెవిన్యూ ఆఫీసర్ పవిత్రన్ తన సోషల్ మీడియాలో రంజిత మరణంపై సంచలన పోస్ట్ చేశారు. ‘ఆహ్మాదాబాద్ విమాన ప్రమాద బాధితుల్లో ఓ నాయర్ మహిళ ఉంది.  ప్రభుత్వం మంచి ఉద్యోగం ఇస్తే.. సెలవు పెట్టి మరీ విదేశాలకు వెళ్లింది. ఆమెకు తగిన శాస్తే జరిగింది’ అంటూ రంజిత మరణంపై అనుచితంగా పోస్టు చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. పవిత్రన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో..  ఈ మ్యాటర్ కాస్త ప్రభుత్వం వద్దకు చేరింది. అనుచిత పోస్టు చేసిన రెవిన్యూ ఉద్యోగిపై కేరళ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని.. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాసర్‌గోడ్ కలెక్టర్ అతడిని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×