Intinti Ramayanam Today Episode October 8th: పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే మీనాక్షి పల్లవి పల్లవి అని పిలుస్తుంది. అయితే పల్లవి ఎంతసేపటికి రాకపోవడంతో మీనాక్షి నేను కూడా పల్లవితో పాటే వెళ్ళిపోతాను. పల్లవి లేనిచోట నేను కూడా ఉన్నాను. పిల్లలు తప్పు చేస్తే తల్లి కూడా తప్పు చేసినప్పుడే కదా నేను కూడా వెళ్ళిపోతున్నాను. అని మీనాక్షి అంటుంది. అవని ఎంత చెప్తున్నా కదా మీనాక్షి అస్సలు వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మీనాక్షి ఎంత చెప్పినా కూడా వినకుండా అవని పిలుస్తున్నా వినిపించుకోకుండా మీనాక్షి వెళ్లిపోవాలని అనుకుంటుంది. మీనాక్షి వెళ్లిపోతున్న విషయాన్ని చక్రధర్ కు చెప్తుంది. పల్లవితో పాటు మీనాక్షి వెళ్ళిపోతుంది.
పల్లవి రాజేశ్వరి ఇంటికి వెళుతుంది. అయితే అక్కడికి వెళ్ళగానే భరత్ ప్రణతి ఇద్దరు కూడా పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు.. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చెప్పకుండానే భరత్ ఎందుకు వచ్చావు సిస్టర్ అని అడుగుతాడు. కానీ తెలుగు మాత్రం ఏం చెప్పినా కూడా అసలు వినకుండా చక్రధర్ వచ్చి పెద్ద రచ్చ చేస్తాడు. అయితే పల్లవి ఎంత చెప్తున్నా కూడా అసలు వినకుండా అనడంతో చక్రధర్ సీరియస్ అవుతాడు.. అయితే పల్లవి ఎంత చెప్తున్నారు సరే చక్రధర వినకుండా ఉంటాడు అటు భరత్ కూడా పల్లవికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు.
భానుమతి ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు అని చూస్తూ ఉంటుంది. కానీ పల్లవి ఇంట్లోంచి వెళ్లిపోవడం తనకు నచ్చలేదు అన్నట్లుగా ఒక్కసారిగా తన ఆవేశాన్ని బయటపెడుతుంది. అసలు భానుమతి అందరూ రాజేంద్రప్రసాద్ చనిపోయారని బాధపడిపోతూ ఉండగా అక్కడికి వచ్చిన ఆమె అవని ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అనుకుంటుంది. అవనివ్వలేదు తన మనవరాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చాలా బాధపడిపోతుంది. నా కూతురు రాజేశ్వరిని చంపేసింది అవని అని అంటుంది. నా అల్లుడ్ని తన తల్లి వైపు తిప్పుకునేలా చేసుకుని నా కూతురు ఒంటరిదాన్ని చేసి చనిపోయేలా చేసింది. ఇప్పుడు నా మనవరాలు కూడా దూరం చేసింది అని తిడుతుంది. అంతే కాదు నా మనవరాలు ఈ బాధలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే దానికి కారణం నువ్వే అవుతావు అని భానుమతి అనడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
నా కూతురు చనిపోవడానికి కారణం నువ్వే.. ఇప్పుడు నా మనవరాలు కూడా చనిపోయేలా చేస్తున్నావు దాని ఉసిరి తగిలి నువ్వు నాశనం అయిపోతావు అని భానుమతి శాపాలు పెడుతుంది. నా మనవరాలు ఏదైనా ధైర్యం చేస్తుంది అంటే దానికి కారణం నువ్వే.. దాని ఉసురు తగులుతుంది నువ్వు కచ్చితంగా నాశనం అయిపోతావు అంటూ భానుమతి అనడంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది.. నువ్వు నీ జీవితం నాశనం అయిపోతుంది అంటూ అవ్వనీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది భానుమతి. ఏంటి అత్తయ్య అవని తప్పు ఏం లేకపోయినా మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని వేసుకుంటాడు. అయితే భానుమతి ఆ మాట వినగానే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏదైనా అగైతుంది అంటే కచ్చితంగా నువ్వే కారణం అంటూ చెప్పడంతో అవని కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది..
పల్లవి అవని పై కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ పగలగొడుతూ ఉంటుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఆ అవని కాబట్టి దాని జీవితం ఎలాగైనా సరే నాశనం చేస్తాను అని అంటుంది. అయితే అవన్నీ నన్ను ఇంట్లో నుంచి మెడపట్టి గెంటేసేలా చేసింది కాబట్టి దాని జీవితం ఎలాగైనా సరే కుక్కలు చింపిన విస్తరిని చేస్తాను అని పల్లవి తనను తానే వార్నింగ్ ఇచ్చుకుంటూ చాలా ఆవేశంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తన జీవితం ఇలా అవడానికి అవని కారణం కాబట్టి తనకి ఊహించని షాక్ఇవ్వాలని పల్లవి అనుకుంటుంది. ఇక అంతే కాదు అక్కడ ఉన్న స్ట్రైట్నన్ని తీసుకొని తన చేతికి కాల్చుకుంటుంది. ఆ తర్వాత అవనికి జీవితం అంటే ఏంటో లేకుండా చేయాలి అని అనుకుంటుంది.. పల్లవికి సపోర్టుగా మీనాక్షి కూడా ఉండడంతో పల్లవి ఎలాగైనా సరే అవినీతి తల్లిని కూడా దూరం చేసి నా రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటుంది. అటువైపు అవని పల్లవి నెక్స్ట్ కుటుంబంపై ఎలాంటి కక్ష తీర్చుకుంటుందో అని భయపడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..