E-Paper
Advertisement

పరీక్షల పేరుతో రక్తం పిండుతున్నారా? హుజూరాబాద్‌లో కార్మికుల శాంపిళ్ల సేకరణపై వివాదం!

పరీక్షల పేరుతో రక్తం పిండుతున్నారా? హుజూరాబాద్‌లో కార్మికుల శాంపిళ్ల సేకరణపై వివాదం!
Advertisement

Huzurabad: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్‌ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో కార్మికుల ఆరోగ్య పరీక్షల పేరిట జరుగుతున్న వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. లేబర్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న పేద కార్మికులకు వైద్య పరీక్షలంటూ ప్రైవేటు ఏజెన్సీలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. సరైన వసతులు, వైద్యుల పర్యవేక్షణ లేకుండానే బహిరంగ ప్రదేశాల్లో రక్త నమూనాలు సేకరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మైదానాల్లోనే ‘అంగడి’ పరీక్షలు..

Advertisement

తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను కొల్లగొట్టే లక్ష్యంతోనే కొన్ని ప్రైవేటు హెల్త్‌కేర్ సంస్థలు ఈ తంతు నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రి, డయాగ్నస్టిక్ కేంద్రాల ఊసే లేదు; వైద్యులు, ఫార్మసిస్టులు అసలే కనిపించరు. పాఠశాల మైదానాలు, పంచాయతీ కార్యాలయాల ఆవరణలు, మార్కెట్ ప్రాంతాల్లో కేవలం ఒక్కరే సిబ్బందిగా వచ్చి మొబైల్ ఫోన్‌లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అనంతరం రక్త నమూనాలు (సీరం) సేకరించి తీసుకెళ్తున్నారు. అయితే ఆ నమూనాలను ఎక్కడికి తరలిస్తున్నారన్నది అంతుచిక్కడం లేదు. పరీక్షించిన తర్వాత రిపోర్టులు ఇవ్వడం లేదు, ఫలితాల ఆధారంగా ఎలాంటి చికిత్సా అందించడం లేదు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు కనీసం ఐరన్ మాత్రలు కూడా పంపిణీ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు.

బెదిరించి మరీ రక్తం సేకరణ..

Advertisement

కార్డు పొందినందుకు నెలనెలా రక్తం ఇవ్వలేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలకు రాకపోతే కార్డులను రద్దు చేస్తామంటూ ప్రైవేటు సిబ్బంది బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అర్హత లేని సిబ్బందిని రంగంలోకి దించి, కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని మండిపడుతున్నారు.

బోర్డు నిధుల దోపిడీని అడ్డుకోవాలి..

కార్మికులకు ఏమాత్రం ప్రయోజనం లేని సీఎస్‌సీ సంస్థ హెల్త్ టెస్టుల పేరుతో కోట్ల రూపాయల నిధులను కొల్లగొడుతోందని, వీటిని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కదిరే రమేశ్ డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెడుతూ ప్రభుత్వం కార్మికుల కడుపు కొడుతోందని విమర్శించారు. బోర్డు సెస్సు నిధులను పింఛన్లు, పిల్లల చదువులు, స్కాలర్‌షిప్‌లు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలకే కేటాయించాలని కోరారు.

అధికారులు స్పందించాలి..

వైద్యారోగ్య శాఖ అనుమతులు లేకుండా నడిపిస్తున్న ఈ రక్త సేకరణ దందాపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) తక్షణమే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు ఉధృతం చేస్తామని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.

Also Read: భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!

Tags

Related News

RTA లో అవినీతి దందా.. 9 ఏళ్లుగా ఒకే చోట తిష్ట!

తల లేదు, కాళ్లు లేవు… NTTPS కాలువలో కట్ చేసిన మొండం! అసలు ఎవరా మహిళ?

కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ డ్రామాలు బంద్ చేయాలి- బండి సంజయ్

హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య వెనుక.. అనాథలైన కవలలు, గొడవలే అసలు కారణమా?

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

చికెన్, మటన్ షాప్‌లో మీకు ఇలా జరిగిందా.. అయితే బీకేర్ ఫుల్!

జూరాల డ్యామ్‌ వద్ద ఉత్కంఠ.. రైతుల ధర్నాతో పోలీసులు పహారా!

Big Stories

Advertisement
×