Telangana SA-1 SA-2 Exams: స్వేచ్ఛ బ్యూరో: సమ్మెటివ్ పరీక్షలు ముగిసిన తరువాత మూడు నుంచి 5 రోజుల లోపుగా మూల్యాంకనంను పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సమ్మెటివ్-1, 2 పరీక్షలకు సంబంధించి ఎక్స్‌టర్నల్ మూల్యాంకనం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ జారీ చేశారు.
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఎస్ఏ-I ఎస్ఏ-2 పరీక్షలకు ఎక్స్‌టర్నల్ ఎవల్యూషన్ సిస్టంను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు పాఠశాలలోని సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులే తమ విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేవారు. ఇకపై మూల్యాంకనంలో నిష్పాక్షికత, పారదర్శకత, ఏకరూపత, కచ్చితత్వం, జవాబుదారీతనం పెంచేందుకు ఎక్స్‌టర్నల్ ఎవల్యూషన్ విధానాన్ని అమలు చేయనున్నారు.
పరీక్షలు ఇప్పటిలాగే పాఠశాల స్థాయిలోనే జరుగుతాయి. పరీక్ష పూర్తయిన అదే రోజు..,హెడ్మాస్టర్ జవాబు పత్రాలను సేకరించి, సురక్షితంగా మండల్ రిసోర్స్ పర్సన్(ఎంఆర్‌సీ) ఆధ్వర్యంలో సంబంధిత ఎంఈవోకు అప్పగించాలి. ఆ తరువాత ఎంఈవో ఎవల్యూషన్ ఇన్‌ఛార్జ్‌లను, అవసరమైనంత మంది ఎవల్యూటర్స్ ను నియమించి మూల్యాంకనం నిర్వహించాలి. మూల్యాంకనం 3 నుంచి 5 రోజులలోపు పూర్తి కావాలి. వీలైనంత వరకు వెరిఫికేషన్, ఆన్‌లైన్ మార్క్ ఎంట్రీ కూడా కూడా అదే రోజు పూర్తి చేయాలి.
Also Read: మల్లం బ్రహ్మోత్సవాల్లో తీవ్ర విషాదం.. వేడి సాంబారు పడి 12 మందికి గాయాలు