Army Chief : భారత్ చైనా సరిహద్దులోని లద్ధాఖ్ లో రెండేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు చల్లబడేలా కనిపించడం లేదు. ఇటీవలే ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు ఉద్రిక్తతకు పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయమై సైనికులు అధికారులు, విదేశాంఖ శాఖల మధ్య అనేక దఫాల చర్చల అనంతరం పూర్వ స్థితికి వచ్చేందుకు నిర్ణయించారు. కానీ.. ఈ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తలు చల్లబడలేదని తెలుస్తోంది.
తాజాగా సరిహద్దులు వెంట చైనా బలగాలు సైనిక విన్యాసాలు చేపట్టడంతో.. భారత్ అప్రమత్తమైంది. ఈ ప్రాంతంలో తిరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇరుదేశాల సైన్యాలు మళ్లీ తిరిగి ఆ ప్రాంతాలకు బలగాల్ని తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తత ఇప్పటికీ కొంత కొనసాగుతుందంటూ ఏకంగా భారత సైన్యాధిపతి జనరల్ ఉపేందర్ ద్వివేది వెల్లడించారు.
జనవరి 15న నిర్వహించనున్న సైనిక దినోత్సవం (ఆర్మీ డే) సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన జనరల్ ద్వివేది ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరుదేశాలు సంప్రదింపు జరపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితులు మాత్రం స్థిమితంగానే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఏ దేశం మరొక దేశ భూభాగ ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. చాన్నాళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలే ఇంకా చల్లబడలేదని తెలిపారు. అయితే ప్రస్తుతానికి పరిస్థితుల మాత్రం స్థిమితంగానే ఉన్నట్లు జనరల్ ద్వివేది తెలిపారు.
గత ఏడాది అక్టోబర్ 21న భారత్ చైనాలోని డెమ్ చాక్, డెస్సాంగ్ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాయి. అయినా కానీ ఇరువైపుల వైపు.. చాలా చిన్న చిన్న సమస్యలు రోజూ తలెత్తుతుంటాయి. వాటి పరిష్కారానికి సైనిక కోర్ కమాండర్లకు అవకాశాలు ఇచ్చినట్టు జనరల్ వివేది తెలిపారు. అంటే బలగాల గస్తీ, పశువుల మేతకు అనుమతి వంటి విషయాలపై చైనాతో సహజంగానే చిన్న చిన్న ఘర్షణులు తలెత్తుతుంటాయి. వీటిని నివారించేందుకు పై స్థాయి అధికారులు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వేగంగా, త్వరితగతిన స్థానిక సైనికాధికారులే నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ALso Read : రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆసుపత్రికి చేర్చితే రూ.5 వేలు..
వాస్తవాదీన రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటన నివారించేందుకు తాత్కాలిక కాల్పుల విరమణకు ఆలోచిస్తున్నామని వెల్లడించారు. అంతే కానీ ఆయా ప్రాంతాల్లో బఫర్ జోన్ లు అంటే పూర్తిగా కాల్పులపై నిషేధం ఉన్న ప్రాంతాలంటూ ఏమీ లేవని తెలిపారు. 2020 ఏప్రిల్ నుంచి కొనసాగుతున్న ఘర్షణాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఇరుపక్షాలు ఈ ప్రాంతంలో భారీగా బలగాల మోహరింపు చేశాయి. ఆ ప్రాంతంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడంతో పాటు అనేక నూతన నిర్మాణాలను చేపట్టాయి. ఆయా ప్రాంతాల్లో ఆయుధాలను పెద్ద ఎత్తున నిల్వ చేశారు. అత్యాధునిక ఆయుధాలను తరలించేందుకు మౌలిఖ వసతుల్ని కల్పించాయి. వీటన్నింటి నేపథ్యంలో.. వాటిని పూర్తిగా ఇంకా వెనక్కి తీసుకోవాలని పరిస్థితుల్లో ఇప్పటికీ కొంతమేర ఉద్రిక్త కొనసాగుతుందనటానికి ఇది సూచన అని తెలిపారు.