E-Paper
Advertisement

అమిత్ షా పర్యటన వేళ.. అరుణాచలంలో తీవ్ర కలకలం.. హైదరాబాద్ యువకులు అరెస్ట్!

అమిత్ షా పర్యటన వేళ.. అరుణాచలంలో తీవ్ర కలకలం.. హైదరాబాద్ యువకులు అరెస్ట్!
Advertisement

Arunachalam Temple: తమిళనాడులోని అరుణాచలం ఆలయం (తిరువణ్ణామలై)లో తీవ్ర భద్రతా లోపం తలెత్తింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు ముందు ఇది చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఆందోళనలకు దారి తీసింది. కెమెరా అమర్చిన కళ్లద్దాలతో ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా, మూల విగ్రహాలను ఫొటోలు తీశారన్న ఆరోపణలతో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ కు చెందిన భవనీష్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులు.. ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత సాధారణ భక్తుల్లాగే వీరిద్దరు అరుణాచలం ఆలయంలోకి ప్రవేశించారు. అయితే వారు కెమెరా ఉన్న కళ్లద్దాలను ధరించడాన్ని భద్రతా సిబ్బంది తొలుత గమనించలేదు. దీంతో ఆ స్మార్ట్ గ్లాసెస్ ను ఉపయోగించి.. సీక్రెట్ గా ఆలయంలోని అరుణాచలేశ్వర స్వామి, ఉన్నాములై అమ్మవారి చిత్రాలను వారు తీసినట్లు తెలుస్తోంది.

మరి ఎలా కనిపెట్టారంటే?

Advertisement

సాధారణంగా స్మార్ట్ గ్లాసెస్ లో ఫొటోలు, వీడియోలు తీసేటప్పుడు ఎదుటివారికి తెలిసేలా అందులో ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా కంపెనీలు ఈ సెక్యురిటీ ఫీచర్ ను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలోనే మూల విరాట్ ను వారు ఫొటోలు తీస్తుండగా.. ఎల్ఈడీ లైట్ బ్లింక్ కావడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై భవనీష్, మహేశ్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చెక్ చేయగా.. మూల విరాట్ ఫొటోలు కనిపించాయి. నిబంధనలకు విరుద్దంగా ఫొటోలు తీసినందున వారిని పోలీసులకు అప్పగించారు.

Also Read: భారత్‌కు అమెరికా బిగ్ షాక్.. రష్యా నుంచి చమురు కొంటే 100% ట్యాక్స్.. బిల్లుకు సెనేట్ ఆమోదం!

అమిత్‌షా పర్యటన వేళ ఘటన

Advertisement

ఇదిలా ఉంటే సాయంత్రం అమిత్ షా తిరువన్నామలై చేరుకొని.. అరుణాచల ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇలా భద్రతా లోపం బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తున్న షా.. అనంతరం తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండ్రోజులు పర్యటించనున్నారు. సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో ఆయన తిరువన్నామలైకి చేరుకునే అవకాశముంది. సుమారు గంటసేపు ఆలయ పరిసరాల్లో ఆయన గడపనున్నారు. అనంతరం 6 గంటల ప్రాంతంలో పుదుచ్చేరికి బయలుదేరుతారని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: ఘాట్ రోడ్డులో ఘోరం.. లోయలో పడ్డ బస్సు.. 8 మంది స్పాట్ డెడ్!

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×