E-Paper
Advertisement

ఘాట్ రోడ్డులో ఘోరం.. లోయలో పడ్డ బస్సు.. 8 మంది స్పాట్ డెడ్!

ఘాట్ రోడ్డులో ఘోరం.. లోయలో పడ్డ బస్సు.. 8 మంది స్పాట్ డెడ్!
Advertisement

Bus Accident: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో శనివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి కింద ఉన్న మరొక రోడ్డుపైకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్‌తో సహా కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే?

బైరాగఢ్ నుండి చంబా ప్రాంతానికి ‘శర్మ బస్ సర్వీస్’కు చెందిన ప్రైవేట్ బస్సు.. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన 3 కిలోమీటర్లకే దేవికోఠి ప్రాంతంలోని చలుంజ్ మోర్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపుతప్పిన వాహనం బోల్తా కొడుతూ కింద ఉన్న రహదారిపై పడిపోయింది.

Advertisement

బస్సులో 18 మంది ప్రయాణికులు

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది హుటాహుటీనా అక్కడికి చేరుకున్నాయి. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి.. బస్సు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశాయి. ఆపై క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి.

మరో ఆరుగురి పరిస్థితి విషమం

Advertisement

ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన 10 మందిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం చంబాలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Also Read: ఇంటి పైకప్పుపై గార్డెన్.. ఇక లైఫ్‌లో ఏసీలు, కూలర్లు అక్కర్లే.. బోలెడన్ని బెనిఫిట్స్!

ప్రమాదకరమైన కొండ మార్గం

ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన బైరాగఢ్-తిస్సా రహదారి సుమారు 27 కిలోమీటర్ల మేర కొండల నడుమ విస్తరించి ఉంది. చురా లోయలో ఉన్న ఈ రహదారి.. చాలా ఇరుకైన మలుపులు, వాలులతో ప్రమాదకరంగా ఉంటుంది. ఎత్తైన సచ్ పాస్ ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులకు ఈ మార్గమే ఏకైక మార్గం. కాగా, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కొత్త రెడ్‌మీ ఫోన్లు.. లీక్ అయిన వివరాలు ఇవే!

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×