Assembly Bypolls In India : నిన్న మునుగోడు ఉపఎన్నికల ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా ఇలా ఆరు ఉపఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలంగాణ, యూపీ, హరియాణ, మహారాష్ట్ర, ఒడిశా, బిహార్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. తెలంగాణలో బీజేపీ రెండవ స్థానంలో నిలిచి పరాజయం పొందినా.. హరియాణ, ఒడిశా, యూవీ, బిహార్‌లో కమలనాధులు గెలిచారు.
ఇక భాజపాకు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ ఏక్‌నాధ్ షిండే తిరుగుబాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత వచ్చిన మొదటి ఉపఎన్నిక. అంధేరి (తూర్పు) నియోజకవర్గం ఉపఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్ధి రుతుజ లట్కే గెలుపొందారు. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రెండవ స్థానంలో ప్రత్యర్ధి పార్టీలకు వచ్చిన ఓట్లకంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి.
హరియాణాలో అదంపూర్ ఉపఎన్నికల్లో బీజేపీ తరపున మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ గెలుపొందారు. ఒడిశా ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ తరుపున సూర్యభన్షి సూరజ్ దక్కించుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అర్వింద్ గిరి తనయుడు అమన్‌గిరి.. గోలా గోకర్ణ్‌నాధ్ సీటును దక్కించుకున్నారు. బిహార్‌లో గోపాల్‌గంజ్, మొకామా రెండు స్థానాలకు ఉపఎన్నిక జరగగా గోపాల్‌గంజ్‌ను బీజేపీ, మోకామాను ఆర్జేడీ దక్కించుకుంది.