BB Telugu 8.. ఎట్టకేలకు 8వ సీజన్ చివరి రోజుకు చేరుకుంది. ఈరోజు రాత్రి 7 గంటల నుండి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ స్టార్ మా ఛానల్లో ప్రసారం కానుంది. గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన ప్రోమోను నిన్న ఎపిసోడ్ చివర్లో వేయడం మనం అందరం చూసాం. ఇక అందులో భాగంగానే ప్రగ్యా జైస్వాల్, ఉపేంద్ర వంటి సెలబ్రిటీలు కూడా అతిధులుగా విచ్చేశారు. ఇకపోతే ఈరోజు గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన షూటింగ్ ను కాస్త కొంతవరకు పూర్తి చేశారు. ఇకపోతే హౌస్ నుండి ఐదవ స్థానంలో ఉన్న అవినాష్, నాల్గవ స్థానంలో ఉన్న నబీల్, మూడవ స్థానంలో ఉన్న ప్రేరణ ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. ఇకపోతే రూ.15లక్షల ఆఫర్ ని బిగ్ బాస్ ప్రేరణకు ఇస్తే.. ఆమె మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేసింది. ముఖ్యంగా ఈ సూట్ కేస్ తీసుకునే అర్హత ప్రేరణకి ఉందని చెప్పినా సరే ఆమె మాత్రం తీసుకోలేదు. అలా ముగ్గురు హౌస్ నుండి వెళ్ళిపోయారు.
ఇక ప్రస్తుతం నిఖిల్, గౌతమ్ వీరిద్దరిలో ఒక్కరే టైటిల్ కొట్టబోతున్నారనేది మనకు అర్థమయిపోయింది. అధికారిక ఓటింగ్ లో కూడా అలాగే ఉంది. మరి ఏం జరగబోతోంది అనేది చూడాలి. ఇకపోతే ఈ ఎపిసోడ్ కి మాజీ కంటెస్టెంట్స్ అయిన ప్రతి ఒక్కరు వచ్చారు. కానీ విష్ణుప్రియ, హరితేజ, నయని పావని మాత్రం రాలేదు. విష్ణుప్రియ ఇలాంటి సందర్భాలలో మంచి టిఆర్పి కంటెంట్ ఇస్తుంది. ఆమె లేని ఇలాంటి ఈవెంట్స్ ని కూడా ఊహించుకోలేం. మరి ఏ కారణం చేత ఫినాలేకి రాలేదో అర్థం కావడం లేదు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)రాబోతున్నారు. ఆయన చేతుల మీదుగానే గౌతమ్ లేదా నిఖిల్ కి కప్పుని అందివ్వబోతున్నారు.
ఇదిలా ఉండగా రాంచరణ్ కంటెస్టెంట్స్ అందరితో కూడా ముచ్చటించారట. గౌతమ్ రామ్ చరణ్ కి పెద్ద ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి తన అభిమాన హీరో చేతుల మీదుగా కప్పు తీసుకుంటాడో లేదో చూడాలి. ఇకపోతే ఇక్కడ ఉన్న ఐదు మందిలో రాంచరణ్ కి నబీల్ బాగా నచ్చాడట. అతని మాట తీరు, మేనరిజం ఆయనను ఇంప్రెస్ చేశాయట.కామెడీ టైమింగ్ కూడా బాగా నచ్చిందట. అయితే సినీ నటుడు అవ్వాలనే తన కోరికతో వున్న నబీల్ కి రామ్ చరణ్ భారీ ఆఫర్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్లో అమర్ దీప్ కి రవితేజ తన సినిమాలో నటించే అవకాశం ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు నబీల్ కి కూడా అలాంటి అవకాశం లభించింది. మరి రామ్ చరణ్ తన తదుపరి చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నారు. మరి ఆ సినిమాలో అవకాశం ఇస్తారో లేదో చూడాలి.