E-Paper
Advertisement

ఈశ్వర్ సాయితో ఫోక్ సాంగ్స్.. మాధురి చెప్పిన ఆ విషయాలు మళ్లీ వైరల్!

ఈశ్వర్ సాయితో ఫోక్ సాంగ్స్.. మాధురి చెప్పిన ఆ విషయాలు మళ్లీ వైరల్!
Advertisement

Madhuri Rathod: ఈశ్వర్ సాయి …ఫోక్ సాంగ్స్ అండ్ రీల్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ డ్యాన్సర్ కమ్ యాక్టర్ రాసలీలల వ్యవహారం గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సంగతి తెల్సిందే. తోటి ఫోక్ డ్యాన్సర్, నటి మాధురి రాథోడ్‌తో కలసి వేములవాడలోని ఒక రెడ్డి భవన్‌లో ఉండగా , ఈశ్వర్ సాయి భార్య వారిని గమనించి అక్కడికి చేరుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఈ వివాదం ఇలా నడుస్తున్న ఈ క్రమంలో గతంలో మాధురి రాథోడ్ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

డాన్స్ అలా నేర్చుకున్నా …

Advertisement

ఆ ఇంటర్వ్యూలో మాధురి రాధోడ్ మాట్లాడుతూ తమది ఏడుగురు పిల్లలున్న పెద్ద కుటుంబమని తెలిపింది. ఇంట్లో ఉన్న అక్కలను అమ్మ డ్యాన్స్ క్లాసులకు పంపేదని, కానీ తనను మాత్రం క్లాసులకు పంపలేదని వాపోయింది . దాంతో ఇంట్లోనే టీవీ చూస్తూ సొంతంగా డ్యాన్స్ స్టెప్పులు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది.అలా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో కాలేజ్ ఫంక్షన్లలో డ్యాన్స్ చేయడం, ఆపై టిక్‌టాక్ (TikTok) ద్వారా వీడియోలు చేయడం ప్రారంభించానని తెలిపింది.

మామూలు సినిమా పాటల కంటే జానపద గీతాలకే (Folk Songs) నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభించిందని, అలా వరుసగా ఫోక్ సాంగ్స్ చేశానని దాంతో ‘మాధురి రాథోడ్’ అనే పేరు తన సొంతమైందని వివరించింది.

అతనంటే ఎంతో అభిమానం 

Advertisement

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో పెరిగిన పోటీ, రీచ్ గురించి మాట్లాడుతూ.. కేవలం ట్రెండింగ్ పాటలు చేయడం కాకుండా, పాత జానపద గీతాలను (90s, 2000s నాటి ఫోక్ మెలోడీలు) సెలెక్ట్ చేసుకుని, కొత్త స్టెప్పులతో రీల్స్ చేయడం తన స్టైల్ అని చెప్పుకొచ్చింది.ఇక శేఖర్ మాస్టర్ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన కొరియోగ్రఫీ స్పూర్తితో పెద్ద ప్రాజెక్టుల్లో, వెబ్ సిరీస్‌లలో అవకాశం సాధించడమే లక్ష్యమని మనసులోని మాటల్ని బయటపెట్టింది. ఇక యూట్యూబ్‌లో శ్వేతా నాయుడు, మెహబూబ్ వంటి వారితో కలిసి కవర్ సాంగ్స్ చేసిన అనుభవాలను కూడా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.

ఇక సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కామెంట్స్ గురించి అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అవుతూ “నెగెటివిటీకి రియాక్ట్ అయితే అది ఇంకా పెరుగుతుంది. 80 శాతం పాజిటివిటీని మాత్రమే తీసుకుంటాను, మిగిలిన 20 శాతాన్ని పట్టించుకోను” అని క్లారిటీ ఇచ్చేసింది.గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు ,బాధలు ఎదురయ్యాయని, అయితే అవేమీ పట్టించుకోకుండా కెరీర్, డ్యాన్స్ పైనే తన దృష్టంతా పెట్టానని తెలిపింది.

సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్

ఇక ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ జోడీ విషయానికి వస్తే ఈ కాంబినేషన్‌ లో వచ్చిన పలు ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాతిరి ఓ రాతిరి, ‘సిలకా’, ‘ఎర్రకోక’, ‘గుడు గుడు కుంచం’ వంటి రీమిక్స్ సాంగ్స్, మాస్ జానపద బాణీలు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి కూడా.

also read :ఆడవాళ్లే ఆడవాళ్లను ఎందుకంటే ..శ్రావణ భార్గవి షాకింగ్ కామెంట్స్!

ఒకవైపు ఈ జానపద పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ, ఇప్పుడు వేములవాడ ఘటనతో వివాదాల్లో చిక్కుకోవడం వైరల్ అయిపొయింది.దీంతో గతంలో మాధురి ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ వీడియో క్లిప్స్, మీమ్స్, కామెంట్స్ ఇపుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×