Ban Turkey: టర్కీ ప్రభుత్వం ఇటీవల పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించిన తర్వాత, భారత్‌లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్ సాయాన్ని మరచి, టర్కీ కుటిల బుద్ధితో ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్లు అందించి మరీ పాకిస్తాన్ కు సహకరించింది.
కేవలం ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా మన దేశం దాడులు నిర్వహిస్తే, పాక్ ఏకంగా టర్కీ ఇచ్చిన డ్రోన్స్ సహాయంతో మన దేశంపైకి కయ్యానికి వచ్చిన విషయాన్ని యావత్ ప్రపంచం వ్యతిరేకించింది. టర్కీ చర్యలపై దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు స్పందించాయి. ఈ క్రమంలో పుణే నగరంలో ప్రముఖ ఫ్రూట్స్ వ్యాపారులు ముందడుగు వేసి, టర్కీ ఆపిల్స్‌ను పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.
టర్కీ నుండి దిగుమతయ్యే ఆపిల్స్ మార్కెట్ విలువ భారతదేశంలో సుమారుగా రూ.1200 కోట్ల వరకు ఉంది. ఇది భారీ వాణిజ్య వేదిక అయినప్పటికీ, టర్కీ పాక్‌కు మద్దతు ఇచ్చిన తరుణంలో భారతీయుల మనసు గాయపడి, ఈ దిగుమతులకు చెక్ పెట్టాలని వ్యాపారులు పిలుపునిస్తున్నారు.
పుణేలోని ఆపిల్ మార్కెట్ అసోసియేషన్ నాయకుడు మాట్లాడుతూ, దేశాన్ని ప్రేమించేవాడెవరైనా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన దేశాల వాణిజ్యాన్ని ప్రోత్సహించరు. ఈ నిర్ణయం దేశ భద్రతకు మద్దతు వ్యక్తీకరణని అన్నారు. టర్కీ ఆపిల్స్ స్థానంలో భారతీయ రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చే ఆపిల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాపారులు పిలుపునిస్తున్నారు. ఈ చర్యలు దేశీయ రైతులకు మేలు చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాక, దేశవ్యాప్తంగా టర్కీ ఉత్పత్తులపై బహిష్కారం కోరుతూ సామాన్య ప్రజలు సోషల్ మీడియా వేదికగా #BoycottTurkeyGoods అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం మొదలుపెట్టారు. ముఖ్యంగా యూత్‌లో ఈ ఉద్యమం వేగంగా పాకుతోంది. ఇకపోతే, టర్కీ-పాక్ సంబంధాలపై భారత్‌కు ఉన్న వ్యతిరేకత ఈ బహిష్కారంతో మరోసారి బయటపడింది. కేంద్ర ప్రభుత్వం ఈ దిగుమతులపై ఏదైనా అధికారిక చర్య తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: Mancherial district: మామిడి చెట్లకు పెళ్లి.. రైతన్న స్టైల్ లో రచ్చ!
ఈ సందర్భంగా పలువురు జాతీయవాదులు, రాజకీయ నాయకులు కూడా స్వదేశీ వస్తువుల వినియోగానికి పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేశభక్తి భావాలు పెరిగిపోతుండగా, వ్యాపార రంగం కూడా అదే దిశగా అడుగులు వేయడం గమనార్హం. ఇకపై మన దేశానికి ఏ దేశం వ్యతిరేకంగా వ్యవహరించినా, ఇలాగే బుద్ధి చెప్పాలని యావత్ భారత్ కోరుకుంటోంది.