Bank Holidays : నూతన ఏడాదిలోకి అడుగుపెట్టేశాం. ఎన్నో ఆలోచనల, ఆశయాలతో ఈ ఏడాదిని ఉత్సాహంగా మొదలుపెట్టన యువతరం, నవతరానికి.. రా రమ్మంటూ ఆహ్వానిస్తోంది.. నూతన ఏడాది. తాను అందించే అవకాశాల్ని అందిపుచ్చుకుని.. విజేతలుగా 2025ని ఆస్వాదించండి అని పిలుస్తోంది. ఈ తరుణంలోనే.. ఆర్థికంగా మన ప్రతీ దశలో తోడుగా, నీడగా నిలుస్తూ.. మనకి చేదోడువాదోడుగా ఉంటూ.. మన ఆర్థిక కార్యకలాపాల్ని చక్కదిద్దే బ్యాంకుల గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందులో భాగంగా ముందుగా ఈ ఏడాదిలో బ్యాంకులు పని చేసే రోజులు, ఏఏ రోజుల్లో హాలి డే వంటి వివరాలు అందుబాటులోకి వచ్చేశాయి. బ్యాంకులతో పాటు.. దేశ ఆర్థిక రంగానికి దిక్సూచీ లాంటి స్టాక్ మార్కెట్ల పనిరోజులు, సెలవులపైనా కాస్తా అవగాహన పెంచుకోండి.
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు రోజులు
జనవరి 14 (మంగళవారం) మకర సంక్రాంతి
ఫిబ్రవరి 26 (బుధవారం) – మహా శివరాత్రి
మార్చి 14 (శుక్రవారం) – హోలీ
మార్చి 31 (సోమవారం) – రంజాన్
ఏప్రిల్ 01 (మంగళవారం) – న్యూ ఎకనామికల్ ఇయర్
ఏప్రిల్ 05 (శనివారం) – జగ్జీవన్‌రాం జయంతి
ఏప్రిల్ 14 (సోమవారం) – అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 18 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే
మే 01 (గురువారం) – మే డే
జూన్ 7 (శనివారం) – బక్రీద్
ఆగస్టు 15 (శుక్రవారం) – స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 16 (శనివారం) – శ్రీ కృష్ణాష్టమి
ఆగస్టు 27 (బుధవారం) – వినాయక చవితి
సెప్టెంబర్ 5 (శుక్రవారం) – మిలాద్- ఉన్- నబి
అక్టోబర్ 2 (గురువారం) – గాంధీ జయంతి
అక్టోబర్ 20 (సోమవారం) – దీపావళి
నవంబర్ 5 (బుధవారం) – గురునానక్ జయంతి
డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్
స్టాక్ మార్కెట్ కు సెలవు రోజులు
ఫిబ్రవరి 26 (బుధవారం) – మహాశివరాత్రి
మార్చి 14 (శుక్రవారం) – హోలీ
మార్చి 31 (సోమవారం) – రంజాన్
ఏప్రిల్ 10 (గురువరాం) – శ్రీ మహవీర్ జయంతి
ఏప్రిల్ 14 (సోమవారం) – అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 18 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే
మే 01 (గురువారం) – మహారాష్ట్ర డే
ఆగస్టు 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 27 (బుధవారం) – గణేశ్ చతుర్ధశి
అక్టోబర్ 02 (గురువారం) – గాంధీ జయంతి
అక్టోబర్ 21 (మంగళవారం) – దీపావళి లక్షీపూజ
అక్టోబర్ 22 (బుధవారం) – దీపావళి
నవంబర్ 05 (బుధవారం) – గురునానక్ జయంతి
డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్
దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తాయి. శని, ఆదివారాలు సెలవు రోజులు. కానీ.. ఫిబ్రవరి 1 తేదీన శనివారం అయినా స్టాక్ ఎక్స్చేంజీలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఎందుకంటే ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా మదుపర్లు ఎక్కువగా క్రయావిక్రయాలు జరుపుతుంటారు కాబట్టి.. ఆ రోజు పనిదినంగా నిర్ణయించారు. అలాగే.. దీపావళి రోజు మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. దీపావళికి కొద్ది రోజుల ముందు ఆ వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజీలు వెల్లడిస్తాయి.
Also Read : బుర్కా ధరించకపోతే విడాకులు.. అలా కుదరదన్న హై కోర్టు
బ్యాంకులకు ప్రకటించిన సెలవులు ప్రాంతాలను బట్టి సెలవుల్లో తేడాలు ఉండనున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థానిక పండుగలు, ప్రాధాన్య పర్వదినాలు ఉండడంతో రాష్ట్రాల ఎంపికల మేరకు బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. స్టాక్ మార్కెట్లకు దేశమంతా ఒకేతీరుగా సెలువులు ఉంటాయి. కానీ.. బ్యాంకులకు ప్రాంతాను బట్టి మారిపోతుంటాయి. ఈ వివరాల్ని.. ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులోని రాష్ట్రాలు, ప్రాంతాను బట్టి సెలవులకు అనుమతి ఇచ్చారు.