E-Paper
Advertisement

కొత్త పవర్ బ్యాంక్ వచ్చిందోచ్.. 10,000mAh బ్యాటరీ, LED స్క్రీన్.. జెట్ వేగంతో ఛార్జింగ్ ఫుల్!

కొత్త పవర్ బ్యాంక్ వచ్చిందోచ్.. 10,000mAh బ్యాటరీ, LED స్క్రీన్.. జెట్ వేగంతో ఛార్జింగ్ ఫుల్!
Advertisement

Belkin Power Bank: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ తయారీ సంస్థ ‘బెల్కిన్’ (Belkin) మార్కెట్లోకి మరో సరికొత్త, అత్యాధునిక పవర్‌బ్యాంక్‌ను తీసుకువచ్చింది. 10,000mAh సామర్థ్యంతో, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ‘మోడల్ BPB035’ పవర్‌బ్యాంక్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు మొబైల్స్, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను వేగంగా చార్జ్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక పర్‌ఫెక్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.

ఇన్‌బిల్ట్ టైప్-సి కేబుల్!

ఈ పవర్‌బ్యాంక్ డిజైన్ విషయంలో బెల్కిన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. దీని కోసం ప్రత్యేకంగా మరో చార్జింగ్ కేబుల్స్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇందులోనే బిల్ట్ ఇన్ USB-C కేబుల్ ఇచ్చారు. ఇది పవర్‌బ్యాంక్‌ను పట్టుకోవడానికి ఒక ‘లూప్’ (హ్యాండిల్) లాగా కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రయాణాల్లో క్యారీ చేయడం చాలా సులభం కానుంది. అలాగే పర్యావరణ హితంగా ఉండేందుకు, ఈ పవర్‌బ్యాంక్ బాడీని 73% రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేయడం విశేషం.

45W పవర్ డెలివరీ!

Advertisement

సాధారణ పవర్‌బ్యాంక్‌లతో పోలిస్తే ఇది చాలా వేగంగా డివైజ్‌లను చార్జ్ చేస్తుంది. 45W USB-C పవర్ డెలివరీ (PD) సాంకేతికతతో రావడం వల్ల.. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మ్యాక్‌బుక్ ఎయిర్ లేదా ఇతర టైప్-సి సపోర్ట్ చేసే ల్యాప్‌టాప్‌లను కూడా సులువుగా చార్జ్ చేసుకోవచ్చు. ఒకే సమయంలో రెండు డివైజ్‌లను చార్జ్ చేయాలనుకుంటే, ఒకేసారి 15W + 30W పవర్‌ను ఇది షేర్ చేస్తుంది.

ఎల్ఈడీ డిస్‌ప్లే

చాలా పవర్‌బ్యాంక్‌లలో చార్జింగ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి చిన్న లైట్లు మాత్రమే ఉంటాయి. కానీ ఈ మోడల్‌లో బెల్కిన్ సరికొత్త ఎల్ఈడీ డిజిటల్ డిస్‌ప్లేను అందించింది. దీని ద్వారా పవర్‌బ్యాంక్‌లో ఇంకా ఎంత శాతం బ్యాటరీ మిగిలి ఉందో కచ్చితమైన నంబర్ల రూపంలో స్పష్టంగా చూసుకోవచ్చు.

Advertisement

Also Read: వానలో ఇన్వర్టర్‌తో జాగ్రత్త.. ఈ పొరపాట్లు చేశారో.. షార్ట్ సర్క్యూట్ పక్కా!

లో-పవర్ మోడ్

పవర్ బ్యాంక్ భద్రత కోసం ఇందులో ఓవర్-చార్జింగ్, ఓవర్-హీటింగ్ కాకుండా మల్టీ-ప్రొటెక్షన్ సేఫ్టీ సిస్టమ్ ను అందించారు. అలాగే యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటి చిన్న డివైజ్‌ల కోసం ఇందులో ‘లో-పవర్ మోడ్’ ను కూడా అందించారు. ప్రస్తుతం చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ పవర్‌బ్యాంక్ ధర 269 యువాన్లు (40 డాలర్లు)గా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని ధర రూ.3,761. త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా ఈ పవర్ బ్యాంక్ అడుగుపెట్టే అవకాశం ఉంది.

Also Read: చన్నీళ్ల స్నానానికి గుడ్‌బై.. రూ. 8 వేల లోపే బెస్ట్ గీజర్లు.. సామాన్యులకు పండగే!

Related News

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్‌లను ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×