E-Paper
Advertisement

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. రైల్వే స్టేషన్‌లో పెళ్లి.. గంటల్లోనే విషాదాంతం!

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. రైల్వే స్టేషన్‌లో పెళ్లి.. గంటల్లోనే విషాదాంతం!
Advertisement

Bihar Newlywed Death: వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నూరేళ్లు కలిసి జీవించాలని ఎన్నో కలలు కన్నారు. పెద్దలు వారి కలలకు అడ్డుతగలడంతో.. ఇంట్లో నుంచి పారిపోయిమరి పెళ్లి చేసుకున్నారు. దేవుడి ఆశీస్సులతో కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకొని గుడి వెళ్తుండగా ఒక్కసారిగా నవ వధువు కుప్పకూలి మరణించింది. యువతి బంధువుల ఫిర్యాదుతో వరుడు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. బిహార్ లో జరిగిన ఈ విషాదకర ఘటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..

అరరియా జిల్లా బుట్టర్‌బారీకి చెందిన మనీషా కుమారి (19) బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే జిల్లాలోని పలాసికి చెందిన డిగ్రీ విద్యార్థి దిల్‌ఖుష్ కుమార్ (20)తో ఆమెకు ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. రోజూ మాట్లాడుకోవడంతో ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. అయితే ఇటీవల మనీషా కుటుంబసభ్యులు ఆమెకు వేరొకరితో పెళ్లి నిశ్చయించారు. దీంతో ఆ పెళ్లి ఇష్టం లేని మనీషా.. ప్రేమికుడు దిల్‌ఖుష్‌తో కలిసి వెళ్లిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంది.

రైల్వే స్టేషన్‌లో పెళ్లి..

Advertisement

సోమవారం (ఆగస్టు 10) ఉదయం అరరియా నుంచి బయలుదేరిన ఈ జంట మధ్యాహ్నానికి పూర్ణియా జంక్షన్‌కు చేరుకుంది. బంధువులెవ్వరూ లేకపోవడంతో ఎలాంటి హంగామా లేకుండా రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే దిల్‌ఖుష్ ఆమె నొసటన సిందూరం దిద్ది భార్యగా స్వీకరించాడు. ఆ క్షణంలో తమ పెళ్లికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశారు. ఆ రాత్రికి వారు రైల్వే స్టేషన్‌లోనే గడిపారు.

గుడికి వెళ్తుండగా కుప్పకూలిన వధువు

మరుసటి రోజు సాయంత్రం రాంబాగ్‌ నుంచి సిటీ కాళీ ఆలయానికి మొక్కులు తీర్చుకోవడానికి కాలినడకన వారిద్దరూ బయలుదేరారు. ఆ సమయంలో తీవ్రమైన ఎండ ఉండటంతో మనీషా కళ్లు తిరిగి కుప్పకూలిపోయింది. ఆందోళన చెందిన దిల్‌ఖుష్ స్థానికుల సాయంతో ఆమెను వెంటనే పూర్ణియాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె అనూహ్యంగా కన్నుమూసింది.

Advertisement

Also Read: యూట్యూబర్‌కు బిగ్ షాక్.. పెళ్లి అయిన ఏడాదికే.. కండక్టర్‌తో భార్య జంప్!

పోలీసుల అదుపులో ప్రియుడు

మరోవైపు కూతురు కనిపించకుండా పోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైన పెళ్లి ఫోటో చూసి దిల్‌ఖుష్ ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ వారికి ఎలాంటి సమాచారం దొరకలేదు. ఆ తర్వాత దిల్‌ఖుష్ స్నేహితుల ద్వారా మనీషా మరణించిన వార్త తెలుసుకొని ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే వారు దిల్ ఖుష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకొని.. దిల్ ఖుష్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మనీషా బాడీని పోస్ట్ మార్టంకి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు. దాని ఆధారంగా కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: జియో బిగ్ ఆఫర్.. రూ.2000తో ఏడాదంతా 15 ఓటీటీలు ఫ్రీ.. 1000 పైగా ఛానెళ్లు !

Tags

Related News

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

కోయంబత్తూరు హైవేపై సినిమా తరహాలో.. హెడ్ కానిస్టేబుల్ సాహసం, ఏకంగా 40 కి.మీ ప్రయాణం

Big Stories

Advertisement
×