E-Paper
Advertisement

రాసి పెట్టుకోండి..ఐర్లాండ్ లాగానే టీమిండియాను ఆఫ్ఘ‌నిస్తాన్ చిత్తుగా ఓడిస్తుంది

రాసి పెట్టుకోండి..ఐర్లాండ్ లాగానే టీమిండియాను ఆఫ్ఘ‌నిస్తాన్ చిత్తుగా ఓడిస్తుంది
Advertisement

Tanveer Ahmed On IND VS AFG:  టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ( Team India vs. Afghanistan) మధ్య టి20 సిరీస్ ( Afghanistan tour of India 2026) వచ్చే నెలలో జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు టి20 లు సెప్టెంబర్ 13వ తేదీ నుంచి జరుగుతాయి. ఈ మేరకు తాజాగా షెడ్యూల్ కూడా ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ ( Afghanistan Cricket Board). అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా పరువు తీసేలా పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఐర్లాండ్ చేతిలో ఓడిపోయినట్లుగానే.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో టీమిండియా కచ్చితంగా ఓడిపోతుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ బలంగా ఉందని.. ఆ జట్టును టీ20 లో ఓడించడం చాలా కష్టమన్నారు. వాళ్లు తలుచుకుంటే టీమిండియాను క్లీన్ స్వీప్ చేయడం కూడా జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా టీ20 సిరీస్ షెడ్యూల్

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య సెప్టెంబర్ మాసంలో మూడు టి20 లు ( Afghanistan tour of India 2026) జరగనున్నాయి. జూన్ మాసంలో ఈ రెండు జట్లు టెస్టులు ఆడగా, ఇప్పుడు టి20 ఆడబోతున్నాయి. బంగ్లాదేశ్ ను కాదని , ఆఫ్ఘనిస్తాన్ తో టి20 లు ఆడేందుకు బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి ఈ టోర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరగాలి. కానీ అక్కడ భద్రత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, మూడు టి20 లు కూడా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ20 రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 15వ తేదీన అలాగే 17వ తేదీన మరో రెండు టీ20 లు జరుగుతాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.

Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

ఐర్లాండ్ లాగానే టీమిండియాను ఆఫ్ఘ‌నిస్తాన్ చిత్తుగా ఓడిస్తుంది

టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య మూడు టీ20 లు జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అని శపథం చేశారు. ఐర్లాండ్ చేతిలో ఓడిపోయినట్లుగానే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోవడం అందరూ చూస్తారని సవాల్ విసిరారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోని టీమిండియా చాలా బలహీనంగా ఉందని బాంబు పేల్చారు. అతనికి జట్టును లీడ్ చేయడం చేతకావడం లేదని విమర్శలు చేశారు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అన్నారు. అలా జరగకపోతే పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని చాలెంజ్ విసిరారు.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

 

Related News

సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇంగ్లీష్ మీడియాకు దూరంగా ఉండు..బాబ‌ర్ కు అక్త‌ర్ హెచ్చ‌రిక‌

నా అవ‌స‌రం బంగ్లాదేశ్ కు ఉంది..లేక‌పోతే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేరు

బంగ్లాదేశ్ లో టీమిండియాకు సెక్యూరిటీ లేదు..స్టేడియంపై దాడులు జ‌రిగే ఛాన్స్‌?

కేవ‌లం నెట్స్ లో ప్రాక్టీస్ చేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌తామంటే కుద‌ర‌దు !

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబర్ కు కొమ్ములు వ‌చ్చాయి, అత‌డి PR ఎగిరిపడుతోంది

హార్ధిక్ పాండ్యా రీ-ఎంట్రీ..గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు ?

న‌ఖ్వీ మాట విని రోడ్డున బంగ్లాదేశ్‌…ఫుట్ బాల్ ఆడుకుంటోన్న BCCI

Big Stories

Advertisement
×