E-Paper
Advertisement

జియో బిగ్ ఆఫర్.. రూ.2000తో ఏడాదంతా 15 ఓటీటీలు ఫ్రీ.. 1000 పైగా ఛానెళ్లు !

జియో బిగ్ ఆఫర్.. రూ.2000తో ఏడాదంతా 15 ఓటీటీలు ఫ్రీ.. 1000 పైగా ఛానెళ్లు !
Advertisement

Jio OTT Pass: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్ల కోసం ఇటీవల వార్షిక ఓటీటీ పాస్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 2,000 ధరతో వచ్చిన ఈ యాడ్ ఆన్ ప్లాన్.. ఏడాది మెుత్తం అపరిమితమైన ఓటీటీ వినోదాన్ని అందించనుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని జియో వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక థియేటర్లకు వెళ్లే అవసరమే లేదని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ.2000 ఓటీటీ పాస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

రూ.2000 ప్లాన్ వివరాలు

ఈ ఓటీటీ పాస్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఇందులో మొత్తం 365 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అది కూడా ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్ కలిగి ఉన్నవారికే ఇది వర్తిస్తుంది. ఒకవేళ మీ బేసిక్ ప్లాన్ లో 5G డేటా లేకపోతే.. ఈ ప్లాన్ లో అప్ గ్రేడ్ కింద 5G లభించనుంది. అయితే ఇది యాడ్ ఆన్ ప్యాక్ కాబట్టి ఇందులో ఎలాంటి కాల్స్, రోజువారీ ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉండవు.

ఓటీటీ యాప్స్, లైవ్ చానెళ్లు

Advertisement

ఈ ప్లాన్ ద్వారా ప్రతి నెల దాదాపు రూ. 1,500 విలువైన ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను యూజర్లు పొందొచ్చు. 15 ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ను ఏడాదిపాటు ఫ్రీగా వీక్షించవచ్చు. యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్ తో పాటు జియోటీవీ (JioTV) యాప్ ద్వారా సోనీలివ్, జీ5, సన్‌ NXT, ఈటీవీ విన్, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+ వంటి 15 ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌ల కంటెంట్ చూడవచ్చు. అలాగే జియోటీవీ ద్వారా 1,000 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా వీక్షించవచ్చు.

Also Read: రూ.25 వేలలో బెస్ట్ ఫోన్ కావాలా? చౌకగా వన్ ప్లస్, ఐకూ, శాంసంగ్ మెుబైల్స్.. అమెజాన్‌లో బంపరాఫర్లు!

ఎలా రీఛార్జ్ చేయాలి?

Advertisement

ఈ ఓటీటీ పాస్ ప్లాన్ ను ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో ‘MyJio’ యాప్ ఓపెన్ చేసి ‘Recharge’ సెక్షన్‌కు వెళ్లాలి. రూ.2000 ఓటీటీ పాస్ ప్లాన్ ను సెలక్ట్ చేసుకొని పేమెంట్ చేయవచ్చు. జియో అధికారిక వెబ్ సైట్ లకి వెళ్లి ఇదే పద్దతిలో ప్లాన్ సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ లోనూ ఈ ప్లాన్ ను పొందే వెసులుబాటు ఉంది.

Also Read: ఫైవ్ స్టార్ హోటల్‌ కంటే స్ట్రీట్ ఫుడ్ బెటర్.. ఫుడ్ ఇంజినీర్ చెప్పిన కారణాలివే

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×