E-Paper
Advertisement

యూట్యూబర్‌కు బిగ్ షాక్.. పెళ్లి అయిన ఏడాదికే.. కండక్టర్‌తో భార్య జంప్!

యూట్యూబర్‌కు బిగ్ షాక్.. పెళ్లి అయిన ఏడాదికే.. కండక్టర్‌తో భార్య జంప్!
Advertisement

Akhil NRD Wife: కేరళకు చెందిన ప్రముఖ యూట్యూబర్ అఖిల్ NRD వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య మేఘ.. అర్ధరాత్రి కండక్టర్ తో పారిపోయినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా బస్సు కండక్టర్ తో ఆమె ప్రేమాయణం నడిపిందని.. చివరికి అతడితోనే వెళ్లిపోయిందని నెట్టింట విపరీతంగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై యూట్యూబర్ అఖిల్ ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే..

యూట్యూబర్ అఖిల్ గతంలో మర్చంట్ నావీలో పనిచేశారు. అయితే కంటెంట్ క్రియేటర్ కావాలన్న లక్ష్యంతో ఆ జాబ్ ను వదిలేసి.. యూట్యూబర్ గా మారారు. తద్వారా మిలియన్ల కొద్ది ఫాలోవర్లను సంపాదించారు. ఈ క్రమంలోనే ఆన్ లైన్ లో పరిచయమైన మేఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాది క్రితమే వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మేఘా తరుచూ అఖిల్ యూట్యూబ్ ఛానెల్లో కనిపిస్తూ.. అతడి ఫాలోవర్లకు సైతం సుపరిచితంగా మారారు.

Advertisement

కండక్టర్‌కు దగ్గరైన మేఘా!

అయితే పెళ్లి తన చదువును కొనసాగిస్తానని మేఘా చెప్పడంతో అందుకు అఖిల్ అంగీకరించాడు. దీంతో ఆమె రోజు బస్సులో ప్రయాణిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే బస్సు కండక్టర్ తో అమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే తాజాగా మేఘ ఇంట్లో కనిపించకపోవడంతో అఖిల్ కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కంప్లెంట్ నమోదు చేసి.. వీధిలోని సీసీటీవీని పరిశీలించగా.. పోలీసులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.

తొలుత మిస్సింగ్ కంప్లైంట్

Advertisement

మేఘా తనంతట తానే అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోతూ వీడియోలో కనిపించింది. నైట్ డ్రెస్ లోనే చేతిలో లగేజీతో ఆమె ఇంటి నుంచి బయటకొచ్చి వీధిలో పరిగెడుతూ కనిపించారు. ఓ వ్యక్తి ఆమె బ్యాగును అందుకొని.. కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. దీంతో ఆమె బస్సు కండెక్టర్ తో వెళ్లిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో నెటిజన్లు అఖిల్ కు మద్దతుగా నిలుస్తున్నారు. పరాయి వ్యక్తి మోజులో పడ్డ భార్య లేకపోవడమే మంచిదని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 1917 నాటి బాకీ.. బ్రిటిషర్లకు రూ.35 వేలు ఇచ్చిన తాత.. 109 ఏళ్ల తర్వాత రంగంలోకి మనవడు!

అఖిల్ ఫ్రెండ్ ఏమన్నారంటే?

మరోవైపు ఈ వివాదంపై అఖిల్ ఫ్రెండ్ సాయి కృష్ణ స్పందించారు. అఖిల్ స్వభావం ఎవరినీ నిందించేది కాదని తెలిపారు. తన జీవితంలో ఎదురైన అత్యంత క్లిష్టమైన సమయంలో కూడా అఖిల్ అదే పద్ధతిని పాటిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరిపైనా నిందలు వేయకుండా మౌనంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సాయి కృష్ణ చెప్పుకొచ్చారు.

Also Read: టాటా సన్స్‌కు చంద్రశేఖరన్ రాజీనామా.. కుప్పకూలిన షేర్లు.. గుడ్ బైకి కారణం అదేనా?

Tags

Related News

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

కోయంబత్తూరు హైవేపై సినిమా తరహాలో.. హెడ్ కానిస్టేబుల్ సాహసం, ఏకంగా 40 కి.మీ ప్రయాణం

Big Stories

Advertisement
×