E-Paper
Advertisement

తరుణ్ తేజ్‌పాల్‌ లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!

తరుణ్ తేజ్‌పాల్‌ లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!
Advertisement

Tarun Tejpal: బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో దోషిగా ప్రకటించింది. గోవా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం అనుమతించింది. 2021లో మాపుసా సెషన్స్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తీర్పునే హైకోర్టు రద్దు చేసింది.

లిఫ్ట్‌లో వేదించారని..

2013 నవంబర్‌లో తన జూనియర్ మహిళా జర్నలిస్టును గోవాలోని ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్ట్‌లో లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో మ్యాగజైన్ వార్షిక సదస్సు జరుగుతోంది. బాధితురాలి ఫిర్యాదు తర్వాత 2013 నవంబర్ 30న తేజ్‌పాల్‌ను అరెస్టు చేశారు. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల నేరాలను హైకోర్టు నిర్ధారించింది. పదేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధించింది. రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, 62 ఏళ్ల తన వయసును దృష్టిలో ఉంచుకొని దయ చూపాలని తేజ్‌పాల్ అభ్యర్థించారు.

Advertisement

Also Read: వైద్యురాలి తలపైకి కారు ఎక్కించి.. రాజమండ్రిలో దారుణం, మాల్‌లో యువకులు అఘాయిత్యం

జైలుకు వెళ్తారా?

తాను రాజకీయ బాధితుడినని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా తీర్పుపై 8 వారాల స్టే ఇవ్వాలని కూడా ఆయన విన్నవించారు. కానీ బాంబే హైకోర్టు అవేవీ పరిగణనలోకి తీసుకోలేదు. పదేళ్ల జైలు శిక్ష పడిన తరుణ్ తేజ్‌పాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారా? జైలుకు వెళ్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఈ కేసు నెక్ట్స్ ఎలాంటి టర్న్ తీసుకోబోతోందనే దానికోసం కాస్త వెయిట్ చేయాల్సిందే!

Advertisement

Also Read: దమ్ముంటే ఆడియోలు బయట పెట్టండి.. హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

Tags

Related News

యూపీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పేమెంట్స్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

పెళ్లైన వారం రోజులకే.. విడాకులు మంజూరు, గుట్టు విప్పిన వధువు, ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే పై పోక్సో కేసు నమోదు!

రెండు దశాబ్దాల బంధానికి ముగింపు.. ప్రియుడితో భార్య పెళ్లి చేసిన భర్త, యూపీలో ఆ ప్రేమకుడు ఎవరు?

ప్రయాణికుడిపై ఓ కండక్టర్ ప్రతాపం.. మండిపడిన నెటిజన్స్, కండక్టర్ సస్పెండ్

మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం.. 9 మంది అరెస్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం!

Big Stories

Advertisement
×