BigTV English

Bus falls down from a mountain at Shimla: సిమ్లాలో ఘోరం ప్రమాదం, అదుపు తప్పిన బస్సు, నలుగురు మృతి

Bus falls down from a mountain at Shimla:  సిమ్లాలో ఘోరం ప్రమాదం, అదుపు తప్పిన బస్సు, నలుగురు మృతి

Bus falls down from a mountain at Shimla: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు స్పాట్‌లో మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అసలు ఎలా జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..


హిమాచల్‌ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సు సిమ్లాలో కుద్దు నుంచి దిల్తారీకి వెళ్తోంది. అయితే ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో బస్సు జుబ్బల్‌లోని కెంచి ప్రాంతానికి రాగానే అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్, ఓ మహిళ, నేపాలీ జాతీయుడు మృతి చెందినట్టు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


ALSO READ: ఇంటర్నేషనల్ యోగా డే.. కేంద్ర మంత్రికి చేదు అనుభవం..

గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో నిమగ్నమయ్యారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితుల వద్దకు వెళ్లి ప్రమాదానికి దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు.

 

 

Tags

Related News

Mumbai fire accident: ముంబైలో హై రైజ్‌లో మంటలు.. 23 అంతస్తుల భవనంలో ప్రమాదం.. ఒకరి మృతి!

Gujarat Tragedy: మహాకాళి ఆలయ మార్గంలో ప్రమాదం.. సాంకేతిక లోపమా?

Karnataka Library: ఆస్తులు అమ్మి పుస్తకాలు కొన్నాడు.. అసలు ట్విస్ట్ ఇదే!

Red Fort theft: ఎర్రకోటలో సంచలనం.. బంగారు, వజ్ర కలశాలు గల్లంతు.. విలువ కోట్లల్లోనే!

Samajwadi Leader: పరుపు చాటున దాక్కున్న నాయకుడు.. బెడ్ రూమ్ నుంచి లాక్కొచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు

Modi – Trump: దెబ్బకు దెయ్యం దిగింది.. స్వరం మార్చిన ట్రంప్ – అభినందించిన మోదీ

Big Stories

×