E-Paper
Advertisement

చిన్న కిచెన్ల కోసం బెస్ట్ సోలో.. మైక్రోవేవ్ ఓవెన్ !

చిన్న కిచెన్ల కోసం బెస్ట్ సోలో.. మైక్రోవేవ్ ఓవెన్ !
Advertisement

Voltas Beko 20L solo microwave oven: మన వంటగదిలో రోజు చేసుకునే పనులను చాలా ఈజీ చేయడంలో మైక్రోవేవ్ ఓవెన్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా.. చిన్న కుటుంబాలు, బ్యాచిలర్స్ వంటి వారికి ఎక్కువ శ్రమ లేకుండా వంట పనులు పూర్తి కావాలంటే ఒక మంచి సోలో మైక్రోవేవ్ కచ్చితంగా ఉండాలి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రొడక్ట్‌గా ఈ మోడల్ నిలుస్తోంది. సుమారు రూ.5,290 ధరలో లభించే ఈ మైక్రోవేవ్  గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Voltas Beko 20L solo microwave oven ఫీచర్లు: 

1.కెపాసిటీ, స్పేస్ సేవింగ్ డిజైన్ :

ఈ మైక్రోవేవ్ ఓవెన్ 20 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. ఇది చిన్న కుటుంబాలు, సింగిల్స్ లేదా ఫ్యామిలీ అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సైజ్‌లో చాలా కాంఫక్ట్‌గా ఉండటం వల్ల కిచెన్ కౌంటర్‌ టాప్‌పై అతి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీని క్లాసీ వైట్ ఫినిష్ లుక్ మీ వంటగదికి ఒక మోడర్న్, నీట్ అప్పియరెన్స్‌ని ఇస్తుంది.

2.పవర్, పర్ఫామెన్స్ :

Advertisement

ఇది 700 వాట్స్ పవర్ అవుట్‌ పుట్‌తో పని చేస్తుంది. ఇది విభిన్న పవర్ లెవెల్స్ సహాయంతో ఫుడ్ రీహీట్ చేయడం, డిఫ్రాస్ట్ చేయడం, బేసిక్ వంటలను చాలా వేగంగా పూర్తి చేస్తుంది. ఫుడ్ సమానంగా వేడి చేయడానికి వీలుగా ఇందులో పెద్ద టర్న్ టేబుల్ కూడా ఉంటుంది.

3. యాంటీ బాక్టీరియల్ ఇన్నర్ క్యావిటీ :

ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో ఈ  బ్రాండ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ ఓవెన్ లోపలి భాగం యాంటీ బాక్టీరియల్ ఇన్నర్ క్యావిటీతో వస్తుంది. దీని వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం ఉండదు. అంతే కాకుండా దీనిని  వాసనలు రాకుండా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. రోజువారీ వాడకానికి ఇది పర్ఫెక్ట్.

Advertisement

Also Read: రూ.15వేలలోపే అదిరిపోయే టీవీ.. థామ్సన్ నుంచి సూపర్ మోడల్!

4.బడ్జెట్ , వాల్యూ ఫర్ మనీ:

టాటా , వోల్టాస్ సంయుక్త బ్రాండ్ అయిన ఈ ప్రొడక్ట్ కు మార్కెట్ లో మంచి నమ్మకం ఉంది. అన్ని అడ్వాన్స్‌డ్ బేసిక్ ఫీచర్లు కలిగి ఉండి, ఇది కేవలం రూ.5,290 ధరకే లభించడం దీని అతిపెద్ద ప్లస్ పాయింట్. బడ్జెట్ తక్కువగా ఉండి, ఎక్కువ కాలం పాడవకుండా ఉండే ప్రొడక్ట్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

మీరు తక్కువ ఖర్చులో రోజువారీ రీహీటింగ్, సింపుల్ కుకింగ్ పనుల కోసం ఒక బెస్ట్ మైక్రోవేవ్ వెతుకుతున్నట్లయితే.. ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో లభించే.. ఈ ఓవెన్‌తో మీ కిచెన్ లైఫ్‌ను మరింత ఈజీ చేసుకోండి.

Related News

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

కిడ్స్ సేఫ్టీ కోసం మెటా మాస్టర్ ప్లాన్..హానికరమైన లింక్స్, ఫేక్ యాడ్స్ మాయం!

గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?

120 ఇంచుల బిగ్ స్క్రీన్ మ్యాజిక్..కొత్త లుమియో ఆర్క్ 7 ప్రొజెక్టర్‌తో ఇల్లే థియేటర్!

రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

అమెజాన్ సేల్..ఐఫోన్,వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని తగ్గింపు!

Big Stories

Advertisement
×