E-Paper
Advertisement

టికెట్ బుకింగ్ To లైవ్ ట్రాకింగ్.. ప్రయాణికులను ఆకట్టుకుంటున్న రైల్‌ వన్ యాప్‌!

టికెట్ బుకింగ్ To లైవ్ ట్రాకింగ్..  ప్రయాణికులను ఆకట్టుకుంటున్న రైల్‌ వన్ యాప్‌!
Advertisement

Indian Railways RailOne App: రైలు ప్రయాణం చేసే వారికి టికెట్ బుకింగ్, పీఎన్‌ఆర్ చెక్ చేయడం, రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవడం చేస్తుంటారు. గతంలో ఈ సర్వీసుల కోసం వేర్వేరు యాప్‌లు, వెబ్‌ సైట్లను ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడు భారతీయ రైల్వేకు సంబంధించిన రైల్‌ వన్ యాప్ ఈ సర్వీసులను ఒకే చోట అందిస్తూ ప్రయాణికులకు ఉపయోగకరంగా మారుతోంది.

కోట్లలో డౌన్‌లోడ్లు

రైల్‌ వన్ యాప్ ఇప్పటికే 4.76 కోట్ల డౌన్‌ లోడ్లను దాటింది. రోజుకు సగటున 10 లక్షల టికెట్లను ఈ యాప్ ద్వారా బుక్ చేస్తున్నారు. దీంతో త్వరలోనే 5 కోట్ల డౌన్‌ లోడ్ల మార్క్‌ ను చేరుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌ లో రిజర్వ్‌ డ్, అన్‌ రిజర్వ్‌ డ్ టికెట్లతో పాటు ప్లాట్‌ ఫామ్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. పీఎన్‌ఆర్ స్టేటస్, రైళ్ల సమాచారం, ప్రయాణ వివరాలు తెలుసుకోవడంతో పాటు రైల్ మదద్ ద్వారా ఫిర్యాదులు, సాయం పొందే అవకాశం ఉంటుంది.

ఒకే లాగిన్‌తో బోలెడు సర్వీసులు  

Advertisement

రైల్‌ వన్‌ లోని సింగిల్ సైన్ ఆన్ ఫీచర్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కసారి లాగిన్ అయితే అన్ని రైల్వే సేవలను ఉపయోగించుకోవచ్చు. వేర్వేరు యాప్‌లు డౌన్‌ లోడ్ చేసుకోవడం, ప్రతి సర్వీసుకు స్పెషల్ పాస్‌ వర్డ్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఆగస్టు 2 నాటికి యాప్ ద్వారా రోజుకు సుమారు 10 లక్షల టికెట్ల బుకింగ్ జరుగుతోంది. ఇందులో దాదాపు 2.79 లక్షలు రిజర్వ్‌ డ్ టికెట్లు కాగా, 7.24 లక్షలు అన్‌రిజర్వ్‌ డ్ టికెట్లు ఉన్నాయి.

రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు!

రైళ్ల రాకపోకలు, ఆలస్యాలు, షెడ్యూల్ లాంటి వివరాలను తెలుసుకోవడానికి నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) కూడా ఉపయోగపడుతోంది. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సేవను వెబ్‌ సైట్, మొబైల్ యాప్‌ తో పాటు 139 రైల్వే హెల్ప్‌ లైన్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. స్పాట్ యువర్ ట్రైన్, లైవ్ స్టేషన్, ట్రైన్ షెడ్యూల్, ట్రైన్స్ బిట్వీన్ స్టేషన్స్ లాంటి ఆప్షన్లు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. రైలు ఎప్పుడు వస్తుంది? ఎక్కడ ఉంది? స్టేషన్ల మధ్య ఏ రైళ్లు నడుస్తున్నాయి? లాంటి విషయాలను ఈజీగా తెలుసుకోవచ్చు.

రైలు రద్దయితే ఆటోమేటిక్ గా రీఫండ్  

Advertisement

ఆన్‌లైన్‌లో బుక్ చేసిన రైలు రద్దయితే, రీఫండ్ ప్రక్రియ ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుంది. నిర్ణీత బయలుదేరే సమయం దాటిన తర్వాత డబ్బు తిరిగి ప్రయాణికుడి బ్యాంక్ ఖాతాలో యాడ్ అవుతుంది. అయితే, ఈ సదుపాయం ఆన్‌ లైన్‌ లో బుక్ చేసిన టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. కౌంటర్‌ లో తీసుకున్న టికెట్లకు రీఫండ్ కావాలంటే సంబంధిత PRS కౌంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది.  టికెట్ బుకింగ్ నుంచి రైలు ట్రాకింగ్ వరకు అన్ని సర్వీసులు ఇప్పుడు మొబైల్‌లోనే అందుబాటులోకి వచ్చాయి.  రైలు ప్రయాణాన్ని మరింత సులభంగా, వేగంగా మార్చడంలో ఈ డిజిటల్ సేవలను ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు.

Read Also: ఇక మరింత సౌకర్యవంతంగా లోకల్ రైళ్లు.. వందే మెట్రో రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Tags

Related News

మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ ప్రెస్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

పండుగ రద్దీ వేళ రైల్వే గుడ్‌న్యూస్.. పలు రైళ్లకు అదనపు కోచ్‌లు!

రైలు టికెట్ ఉంటే సరిపోదు.. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ పాటించాల్సిందే!

పాలపిట్టను బంధిస్తే కఠిన చర్యలు.. దసరా వేళ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్!

LNG రైలు vs హైడ్రోజన్ రైలు.. రెండింటి మధ్య అసలు తేడా ఇదే!

డీజిల్ ఖర్చు తగ్గించేందుకు రైల్వే కొత్త ప్లాన్.. ఫస్ట్ LNG రైలు వచ్చేసింది!

నిందితుల కోసం కదులుతున్న కారుపైకి దూకిన పోలీస్.. ఏకంగా 40 కిలో మీటర్లు కళ్లు చెదిరే ఛేజ్!

బోగీలోనే మూత్రం పోసిన తాగుబోతు, అందులోనే దొర్లించి.. చితక్కొట్టిన ప్రయాణికులు!

Big Stories

Advertisement
×