Notification Released for Rajya Sabha Bypolls : రాజ్యసభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం.. రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోనూ ఒక స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ ఎంపీ కేకే (కే.కేశవరావు) రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 14 నుంచి 21వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే రోజున కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది.
తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కోసానానికి ఉపఎన్నిక జరగనుంది. అస్సాం, బిహార్, మహారాష్ట్రలలో రెండేసి స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.