E-Paper
Advertisement

డెడ్‌లైన్ ఫిక్స్.. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక.. కేసులు ఎత్తివేయకుంటే మరిన్ని చర్యలు

డెడ్‌లైన్ ఫిక్స్.. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక.. కేసులు ఎత్తివేయకుంటే మరిన్ని చర్యలు
Advertisement

Cockroach Janta Party: నీట్ పేపర్ లీకేజీ‌పై తాము చేపట్టిన ఆందోళన విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించింది కాక్రోచ్ జనతా పార్టీ. నిరసనకారులపై నమోదు చేసిన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వివిధ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నవారిని విడుదల చేయాలని కోరింది.

కాక్రోచ్ జనతా పార్టీ వార్నింగ్- సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో విద్యార్థులు, నిరసనకారులను అరెస్టులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో మా ఆందోళనను విరమించుకున్నామని అన్నారు.

Advertisement

కేంద్రం జోక్యం చేసుకోవాలి-వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న నివేదికలు తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వెంటనే జోక్యం చోసుకోవాలన్నారు.  అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేసేలా చూడాలన్నారు. మంగళవారం లోగా లిఖిత పూర్వక హామీ ఇస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తదుపరి కార్యాచరణ చేపడతాం- ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా లేకుంటే గౌరవించకపోతే తదుపరి కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. చర్యలను ఎదుర్కొంటున్నవారికి భరోసా ఇచ్చేందుకు తమ న్యాయ బృందం నిరసనల రోజు నుంచి పని చేస్తోందని చెప్పుకొచ్చారు. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా ఆందోళనకారులపై నమోదైన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు.

Advertisement

రేపటిలోగా డెడ్ లైన్- అరెస్టయిన వారి విడుదల కోసం సాధ్యమైన అన్ని న్యాయ సహాయాన్ని అందించడం కోసం మా బృందం న్యాయవాదులతో సమన్వయం చేస్తోందన్నారు.  మంత్రులతో చర్చల తర్వాత సీజేపీ తన 36 రోజుల ఆందోళనను శనివారం విరమించింది. ఇచ్చిన హామీల్లో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.

ALSO READ: టాటా సుమోపై విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి, వీడియో వైరల్!

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. అలాగే నిరసనకారులపై నమోదైన కేసులు ఎత్తి వేస్తామన్న ప్రభుత్వ హామీ ఇచ్చింది.  భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వడం, ప్రభుత్వంతో మరిన్ని సంప్రదింపుల ద్వారా ఇతర కీలక డిమాండ్లకు సూత్రప్రాయంగా అంగీకరించిందని సీజేపీ తెలిపింది.

ఢిల్లీలో నమోదైన 15 ఎఫ్‌ఐఆర్‌లు ఉపసంహరణపై ఉన్నతాధికారుల నుంచి అధికారిక ఆదేశాలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. మరోవైపు బీహార్‌లోని సివాన్‌లో నిరసనకారులపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది.

Related News

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×