E-Paper
Advertisement

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు.. పట్టించుకోని అధికారులు

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు.. పట్టించుకోని అధికారులు
Advertisement

Illegal Belt Shops: పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. ఏ పల్లెను వెళ్లినా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా దర్శనమిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల మద్య మాఫియా గల్లీకో బెల్టు షాపు ఏర్పాటు చేస్తూ అందిన గాడికి దండుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నియోజకవర్గాలలోని మండల కేంద్రాలతో పాటు గ్రామాలలో విచ్చలవిడిగా బెల్టు షాపులను నిర్వహిస్తున్నారు. అక్రమ బెల్ట్ షాపులు రాజ్యమేలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కిరాణా దుకాణాలకు పోటీగా..

గ్రామాలలో నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం కిరాణా షాపులు పదుల సంఖ్యలో ఉంటాయి. గతంలో అక్రమ బెల్ట్ షాపులు అరకొర ఉండేవి. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా కనుగూనంగా వివిధ రకాల దుకాణాలు వెలుస్తుండగా మద్యం సేవించడానికి పెద్దలకు దీటుగా యువత అలవాటు పడడంతో గ్రామాలలో కిరణా కొట్లకు మించి బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి. ప్రతిరోజు తెల్లవారకముందే వాటిని తెరిచి అర్ధరాత్రి వరకు ఎలాంటి నియంత్రణ లేకుండా నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొందరు మద్యానికి బానిస అయిన వారు టీ కి బదులు వేకువజామునే మద్యం సేవిస్తున్నారు.దీంతో పల్లెటూరి వాతావరణం సైతం దెబ్బతింటుందని ప్రజలు వాపోతున్నారు.

Advertisement

Also Read: మెట్రో రైలుకు గ్లోబల్ గుర్తింపు, ఆ సర్టిఫికేషన్ సాధించిన తొలి సంస్థగా..

యువత మద్యానికి బానిస

గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉండడంతో మద్యానికి బానిస అయిన వారితో పాటు యువత సైతం మద్యానికి ఆకర్షితులవుతూ క్రమంగా బానిస అవుతున్నారు. రోజువారి కూలీలు, నిరుపేద కుటుంబాలకు చెందిన పెద్దలు బానిసలుగా మారి అధికంగా మద్యం సేవిస్తూ తమ ఆరోగ్యాలను చెడిపోవడంతో పాటు జేబులను గుల్ల చేసుకుంటూ అప్పుల పాలవుతున్నారు. మద్యం సేవించిన మందు బాబులను చూసి రోడ్లపై ఒంటరి మహిళలు, యువతులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు,విద్యార్థినీ, విద్యార్థులు కూడా ఈ పరిస్థితుల కారణంగా తమ పనుల కోసం వెళ్లేందుకు సైతం జంకుతున్నారు.

అక్రమ మద్యం..

Advertisement

అతిగా మద్యం సేవిస్తూ రాత్రి వేళల్లో గొడవలు గందరగోల పరిస్థితిలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీస్ శాఖ, ఆబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలలో కొనసాగుతున్న అక్రమ మద్యం దందాను అరికట్టాలని , అక్రమంగా వెలిసిన దుకాణాలను తక్షణమే సీజ్ చేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తున్న ఈ అక్రమ వ్యాపారం పై అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

Also Read: సరస్సు దగ్గర దొరికిన డబ్బు బ్యాగ్… కట్ చేస్తే జాంబీ ప్రపంచంలో… తెలుగులోనే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Tags

Related News

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

Big Stories

Advertisement
×