Karnataka News: రీల్ వేరు.. రియల్ వేరని చెబుతారు. కానీ, ఆ విద్యార్థిని రీల్‌ని.. రియల్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాల్లో నా పరీక్షలు రాస్తే నీకు డబ్బులు ఇస్తాను.. తాను పాస్ కాకుంటే ఇంట్లో చదివించరని హీరోలు చెబుతున్న సన్నివేశాలను మనం చూసే ఉంటాం. కానీ పదో తరగతికి కుర్రాడికి ఒకవైపు ప్రేమ.. మరోవైపు పరీక్ష. ఈ నేపథ్యంలో ఆన్సర్ షీటు 500 రూపాయల నోటు పెట్టాడు. సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. చివరకు ఏం జరిగింది? అసలు స్టోరీ ఏంటి?
కర్ణాటకలో పదో తరగతి పరీక్షలు
పదో తరగతి.. ఇంటర్ పరీక్షలు చెబితేచాలు. పరీక్షలు మొదలు అయ్యేంత వరకు కష్టపడి చదువుతారు విద్యార్థులు. కొందరు స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవాలని భావిస్తారు. మరి కొందరు జిల్లా ఫస్ట్, ఇంకొందరు స్కూల్‌కి ఫస్ట్ వస్తే చాలని అనుకుంటారు. పాసైతే చాలని అనుకునేవారు లేకపోలేదు. అలాంటి వారిలో కర్ణాటకకు చెందిన ఓ పదో తరగతి కుర్రాడు ఒకడు.
బెళగావి జిల్లాలో చిక్కోడి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థికి ఒకేసారి రెండు పరీక్షలు వచ్చాయి. ఒకటి పదో తరగతి.. మరొకటి ప్రేమ పరీక్ష. అదేంటి అనుకుంటున్నారా? అక్కడికి వచ్చేద్దాం. పదో తరగతి పాసైతే కాలేజీ చదవిస్తామని, లేకుంటే లేదని ఇంట్లో తెగేసి చెప్పేశారు తల్లిదండ్రులు. పిల్లలను అలా బెదిరించడం సహజం. అలాంటప్పుడు కష్టపడి చదివితే పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తారు.. అలాంటి సందర్భాలు ఉన్నాయి.
ALSO READ: ఎన్నోసార్లు గర్భం తీయించుకుంది. భార్య వేధింపులు, ఆపై ఆత్మహత్య
పాసయ్యేందుకు ఆ కుర్రాడు స్కెచ్
కర్ణాటకలో పదో తరగతి కుర్రాడికి రెండు పరీక్షలు వచ్చాయి. ఒకటి ఎగ్జామ్ పాస్ కావడం, ఇది సక్సెస్ అయితే ప్రేమ దక్కుతుందని భావించాడు. కనీసం చదవకుండా పాసైపోవాలని స్కెచ్ వేశాడు. ఆన్సర్ షీటుపై ఈ విధంగా రాసుకొచ్చాడు. అందుకు బహుమతిగా ఆన్సర్ షీటులో 500 నోటు పెట్టాడు.
దయచేసి నన్ను పాస్ చేయండి.. నా ప్రేమ మీ చేతుల్లో ఉందని రాసుకొచ్చాడు. తాను పరీక్షలో పాసైతేనే ప్రేమలో పాస్ అవుతానని ప్రస్తావించాడు. మీరు తనను పాస్ చేస్తే డబ్బులు ఇస్తానని, పాస్ చేయకుంటే తల్లిదండ్రులు తనను కాలేజీకి పంపించరని పేర్కొన్నాడు. ఎగ్జామ్ పేపర్లు దిద్దే క్రమంలో ఆ విద్యార్థి పేపరు చూసి ఆ ఉపాధ్యాయుడు షాక్ అయ్యాడు. దాన్ని ఫొటో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
ఆ కుర్రాడిపై సెటైర్లు
ఈ వ్యవహారంపై స్పందించిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చిన్నవయస్సులో పిల్లాడికి ఎంత కష్టం వచ్చిందని కొందరు.. పాస్ చేయాలని కొందరు రాసుకొచ్చారు. ప్రేమ కోసమై వలలో పడ్డాడు పాపం పసివాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తతంగం కేవలం ఒక్క విద్యార్థికి మాత్రమే కాదు.. చాలామంది తమ ఆన్సర్ షీటులో డబ్బులు పెట్టి పాస్ చేయమంటూ రిక్వెస్ట్ చేసుకోవడం గమనార్హం.
ఇలాంటి విద్యార్థులు ఇంకెంత మంది ఉన్నారో తెలీదు. ఏదో పేరు చెప్పి చిన్న వయస్సులో మోసం చేయడం నేర్చుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలపై తల్లిదండ్రులు దృష్టి సారించకుంటే విద్యార్థులు వారి జీవితాలను చేజేతులారా నాశనం చేసుకున్నవాళ్లు అవుతారు. తస్మాత్ జాగ్రత్త.