E-Paper
Advertisement

ఈ గణాంకాల మాటేంటి? ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సవాల్!

ఈ గణాంకాల మాటేంటి? ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సవాల్!
Advertisement

Job Crisis: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్‌‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో మాట్లాడారు. నేడు, భారతదేశపు మొత్తం విద్యా, ఉపాధి వ్యవస్థ నాశనమైపోయిందని అన్నారు. డిగ్రీలు ఇస్తున్నారు, కానీ నైపుణ్యాలు కొరవడ్డాయని అన్నారు. 2025 నాటికి 50% మంది విద్యార్థులను వృత్తి విద్యతో అనుసంధానించాలనే లక్ష్యాన్ని నూతన విద్యా విధానం 2020 నిర్దేశించిందని, కానీ ఇందులో కేవలం 2% మాత్రమే అమలు జరిగిందన్నారు. ఈ మొత్తం ప్రణాళిక ఒక పగటి కలగా తయారు చేసారని ఫైర్ అయ్యారు.

ప్రతి సంవత్సరం 50 లక్షల మంది..

ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఉపాధి కల్పించే పెట్టుబడులకు బదులుగా, ఎంపిక చేసిన కొన్ని పెద్ద పారిశ్రామిక సమూహాలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తున్నాయని, భారతదేశం ప్రతి సంవత్సరం 50 లక్షల మంది పట్టభద్రులను తయారు చేస్తోందని అన్నారు. కానీ వీరిలో కేవలం 28 లక్షల మంది పట్టభద్రుల స్థాయి ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడుతున్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం 22 లక్షల మంది యువత కలలు ప్రారంభం కాకముందే చెదిరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ నియామక పరీక్షల నుండి అనేక ఇతర నియామకాల వరకు, పేపర్ లీక్‌లు ఒక పరిశ్రమగా మారిపోయిందని ఫైర్ అయ్యారు.

Advertisement

Also Read: ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు.. గిన్నిస్ రికార్డ్ బద్దలుకొట్టిన భారతీయ మహిళ

అమ్ముకుంటున్న ఉద్యోగాలు..

దేశంలో ఉద్యోగాలు అమ్ముడవుతున్నాయి. నియామకాల మాఫియా విజృంభిస్తోంది. బీజేపీలో డబ్బు, పలుకుబడి ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తున్నారని అన్నారు. మిత్రులారా, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న యువతకు మనం మద్దతు తెలిపాము. గత కొన్ని రోజులుగా, పార్లమెంటులోనే కాకుండా, వారిపై జరుగుతున్న క్రూరత్వానికి వ్యతిరేకంగా మనం గళం విప్పుతూనే ఉన్నామని గుర్తు చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకు, పిల్లలపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరిపారని అన్నారు.

జంతర్ మంతర్ వద్ద దారుణం..

Advertisement

విద్యార్ధులపై వాటర్ కెనాన్లను ఉపయోగించి, కన్నీటి వాయువును ప్రయోగించారని గుర్తు చేశారు. విద్యుత్‌తో బారికేడ్లు నిర్మించారని, మేకులు దింపిన కర్రలతో లాఠీఛార్జీలు చేశారని అన్నారు. కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ లాఠీలను కూడా వాడారని అన్నారు. గత 15 రోజులుగా మనం దీనిపై పార్లమెంటులో ప్రశ్నిస్తూనే ఉన్నామని, కానీ ఈ విషయంపై ప్రధానమంత్రి గానీ, హోంమంత్రి గానీ స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం పార్లమెంటులో సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటోందని, ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదా అని ఫైర్ అయ్యారు.

Also Read: విదేశాల్లో ఉద్యోగమని.. బీర్ షాపు ఓనర్‌కు అమ్మేశారు.. బాధితురాలు చెప్పింది వింటే కన్నీళ్లు ఆగవు!

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×