E-Paper
Advertisement

డీఎంకే ఇక అద్భుతమైన ప్రతిపక్షం.. ప్రజల తీర్పును గౌరవిస్తానన్న సీఎం స్టాలిన్!

డీఎంకే ఇక అద్భుతమైన ప్రతిపక్షం.. ప్రజల తీర్పును గౌరవిస్తానన్న సీఎం స్టాలిన్!
Advertisement

M K Stalin: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అనూహ్య రీతిలో దూసుకురావడంతో దశాబ్దాల ద్రవిడ రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. గత కొన్ని దశాబ్దాలుగా డీఎంకే.. అన్నాడీఎంకేల మధ్యే సాగుతున్న పోరులోకి విజయ్ మూడవ శక్తిగా ప్రవేశించి అధికార పీఠానికి చేరువయ్యారు. ఈ చారిత్రాత్మక మార్పుతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.

ఈ అనూహ్య ఫలితాలపై తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ హుందాగా స్పందించారు. “ప్రజల తీర్పును తలవంచి స్వీకరిస్తున్నాను.. విజేతలకు నా అభినందనలు.” అని ఆయన ప్రకటించారు. గడిచిన ఐదేళ్లలో ఎన్నో వినూత్న పథకాలను రూపొందించి తమిళనాడు ప్రజలకు సుపరిపాలన అందించామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అన్ని విధాలుగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లామని.. ఎన్నికల బరిలో తమ విజయాలను.. సంక్షేమ పథకాలను వివరిస్తూనే ఓట్లు అడిగామని చెప్పారు. ద్రవిడ మున్నేట్ర కజగం నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌కు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

ముఖ్యమంత్రిగా తన ప్రయాణంలో ఓటు వేసిన వారినే కాకుండా.. ఓటు వేయని వారిని కూడా కలుపుకొని పాలించానని స్టాలిన్ పేర్కొన్నారు. “ప్రజలందరికీ నిజాయితీగా ఉన్నాను.. నా మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకున్నాను. నా సామర్థ్యానికి మించి రాత్రింబవళ్లు పనిచేశాను.” అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంతో పెనవేసుకుపోయిన నాయకుడు కళైజ్ఞర్ కరుణానిధి ఆశయాలతో పనిచేసిన సోదర సోదరీమణులకు.. భుజం భుజం కలిపి నిలిచిన కామ్రేడ్‌షిప్ ఉద్యమ నాయకులు.. వాలంటీర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో అపజయాలను.. విజయాలను చూశానని.. కేవలం గెలుపు ఓటముల కంటే ఆదర్శం.. విధానం ముఖ్యమని తాను నమ్ముతానని స్పష్టం చేశారు.

డీఎంకే రాజకీయ ప్రస్థానం ఇక్కడితో ఆగిపోదని.. నిరాటంకంగా కొనసాగుతుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. “ఇప్పటివరకు ప్రజలకు అద్భుతమైన పాలక పార్టీగా ఉన్న డీఎంకే.. ఇకపై ఒక అద్భుతమైన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తుంది” అని ఆయన ప్రకటించారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని.. కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని చెప్పారు. తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ సిద్ధాంతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

Advertisement

Read Also: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. సొంత కోట భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఘోర పరాజయం!

Related News

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

Big Stories

Advertisement
×