E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్నలను కెపేలో చూసిన దక్షిణమూర్తి        

Karthika Deepam 2 Serial Today Episode September 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్నలను కెపేలో చూసిన దక్షిణమూర్తి        
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  మాలిని దగ్గరకు వెళ్లిన సూరజ్‌.. ఆఫీసు విషయాలు మాట్లాడుతూ.. సీఈవోగా దీపను తీసుకోవడం కంటే వాళ్లకు ఇవ్వాల్సిన పది కోట్లు ఇచ్చి పంపించొచ్చు కదా అని చెప్తాడు. అందుకు మాలిని డబ్బులు ఇచ్చి కోరి శత్రువులను పెంచుకోవడం లాంటిది.. వాళ్లకు ఇప్పుడు పది కోట్లు ఇస్తే.. రేపే మన రెస్టారెంట్స్‌కు ఎదరుగా పోటీగా కొత్త రెస్టారెంట్స్‌ ఓపెన్‌ చేస్తారు. అప్పుడు మనం డబ్బులిచ్చి మనకు పోటీదారులను తయారుచేసుకున్నట్టు అవుతుంది. అందుకే వాళ్లను ఎలాగూ జీతం తీసుకోవడం లేదు కదా ఉండనీ ఎన్ని రోజులు ఉంటారో నేను చూస్తాను అంటూ మాలిని చెప్తుంది. సూరజ్‌ సైలెంట్‌గా వెళ్లిపోతాడు.

జ్యోత్స్న పని చేస్తున్న కెపేకు సూరజ్‌ వెళ్తాడు. అక్కడ కొందరు పోకిరీలు జ్యోత్స్న టీజ్‌ చేస్తుంటారు. వాళ్లను కోపంగా చూసిన సూరజ్‌ వెళ్లి వాళ్లను కొట్టి జ్యోత్స్న తన మరదలని చెప్పి వార్నింగ్‌ ఇచ్చినట్టు కల గంటాడు. జ్యోత్స్న మాత్రం వాళ్లతో కూల్‌ గా మాట్లాడి వెళ్లిపోతుంది. సూరజ్‌ వెళ్లి వాళ్లు అంతలా టీజ్‌ చేస్తుంటే.. ఏమీ అనవా..? అంటూ నిలదీస్తే.. వాళ్లు చేసింది నీకన్నా తక్కువే కదా వాళ్ల కన్నా ఎక్కువే చేసినా నిన్ను ఏమనాలి అంటూ ప్రశ్నిస్తుంది. వాళ్లు ఎంత బాధ పెట్టినా నీ తర్వాతే.. అయినా మీ అమ్మ నీ చుట్టూ బలమైన గోడ చిన్నప్పుడే కట్టేసింది. నువ్వు ఆ గోడ మధ్యలోనే బతుకుతున్నావు బయట వాళ్ల గురించి నువ్వెందుకు పట్టించుకుంటావు అంటూ తిడుతుంది. అంతా మాలిని ఏర్పాటు చేసిన మనిషి చాటు నుంచి వీడియో తీసి మాలినికి సెండ్‌ చేస్తాడు.

Advertisement

అప్పుడే అదే కేపేకు వచ్చిన దక్షిణమూర్తి అక్కడ సూరజ్‌, జ్యోత్స్నలను చూసి ఆశ్చర్యపోతాడు. దగ్గరకు వెళ్లి మీరేంటి ఇక్కడ ఉన్నారు. కాఫీ తాగడానికి వచ్చారా..? అంటూ ప్రశ్ని్స్తుంటే.. సూరజ్‌ అదేం లేదు తాత జ్యోత్స్న ఇక్కడ వెయిటర్‌గా పని చేస్తుంది. నేను కాఫీ తాగడానికి వచ్చాను అని చెప్పగానే.. దక్షిణమూర్తి షాక్‌ అవుతాడు. నువ్వేంటమ్మా ఇక్కడ పని చేయడం ఏంటి..? అని అడిగితే.. తాత ప్లీజ్ ఇప్పటికే నీ మనవడితో వాదించి వాదించి బాగా అలిసిపోయాను.. ఇప్పుడు నీతో వాదించలేను.. మీరే మమల్ని రోడ్డున పడేశారు.. మీరే మమల్ని అనాథల్ని చేశారు.. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను పని చేస్తుంటే మళ్లీ మీరే సానుభూతి చూపిస్తున్నారు.. ఏం అర్థం కావడం లేదు అంటూ జ్యోత్స్న వెళ్లిపోతుంది. దక్షిణమూర్తి కోపంగా శివనారాయణ ఎక్కడున్నావు వస్తున్నా అనుకుంటూ వెళ్లిపోతాడు.

శివనారాయణ కోసం కాంచను ఇంటికి వెళ్తున్న దక్షిణమూర్తికి రోడ్డు మీదే కనిపిస్తాడు శివనారాయణ. దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి కోపంగా ఆడపిల్ల సంపాదన మీద బతకడానికి సిగ్గుగా లేదా..? అంటూ తిడతాడు. జ్యోత్స్న కెపేలో పని చేస్తున్న విషయం చెప్తాడు. అది విని శివనారాయణ షాక్‌ అవుతాడు. జ్యోత్స్న కేపేలో పని చేయడం ఏంటి..? నిజంగా నాకు తెలియదు అంటాడు. దక్షిణమూర్తి కోపంగా నిజంగా నీకు తెలియదా..? నాటకం ఆడుతున్నావు.. అయినా నాకు క్షమాపణ చెప్పి ఉంటే నీ ఆస్తులు నీకు దక్కేవి కదా..? ఇప్పటికైనా క్షమాపణ చెప్పు ఆస్తులన్నీ ఇచ్చేస్తాను అంటాడు దక్షిణమూర్తి.. ఒరేయ్‌ నేను క్షమాపణ చెప్పడం కాదురా నిన్నే నా కాళ్ల దగ్గరకు వచ్చేలా చేస్తాను చూడు అంటూ శివనారాయణ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

Advertisement

ఇంటికి వచ్చిన జ్యోత్స్నను శివనారాయణ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. జ్యోత్స్న అనుమానంగా దక్షిణమూర్తి తాత అంతా చెప్పేశాడేమోనని మనసులో అనుకుని తన జాబ్‌ గురించి తనకు వచ్చే జీతం గురించి చెప్తుంది. అందుకు శివనారాయణ, పారిజాతం కోపంగా జ్యోత్స్నను తిడతారు. దక్షిణమూర్తి మాటలకు అప్పుడే చచ్చిపోయానని శివనారాయణ ఎమోషనల్‌ అయితే.. జ్యోత్స్న మాత్రం కూల్‌గా ఇంకొసారి ఏమైనా అంటే వాళ్ల మనవడి లాగా మనుషులను మోసం చేసి బతకడం లేదని చెప్పండి తాత అంటుంది.  ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

కొడుకు బతకాలంటే రూ. 26 కోట్లు కావాలి.. దాతలు ముందడుగు వేస్తే, కాటేసిన సైబర్ రాక్షసులు!

Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

Big Stories

Advertisement
×