BigTV English

Constitution Day of India : ఆ ఖైదీల్లో ఒక్కరు కూడా జైళ్లల్లో ఉండొద్దు.. అమిత్ షా ఆదేశం..

Constitution Day of India : ఆ ఖైదీల్లో ఒక్కరు కూడా జైళ్లల్లో ఉండొద్దు.. అమిత్ షా ఆదేశం..

Constitution Day of India : వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైళ్లల్లో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దేశీయ జైళ్లల్లో ఉన్న రద్దీని తగ్గించడంతో పాటు, నేరం రుజువు కాకుండానే ఎక్కువ రోజులు జైళ్లల్లో ఉండేవారికి ఊరట కల్పించేందుకు సిద్ధమైంది. ఈ విషయమై ఇప్పటికే అనేక దఫాలుగా ఈ విషయమై ఉన్నత స్థాయిలో సమీక్షలు చేస్తూ వస్తున్న కేంద్ర హోంశాఖ.. తాజాగా వారి విడుదలపై ప్రకటన చేసింది. ఖైదీల విడుదలకు ఇప్పటికే.. మార్గదర్శకాలు విడుదలే చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి అండర్ ట్రయల్ ఖైదీలు విడుదల కానున్నారు.


నిందితులపై మోపిన అభియోగాలు రుజువైన సందర్భంలో వారికి గరిష్టంగా ఎంత కాలం శిక్షపడుతుందో.. అందులో మూడో వంతు జైల్లో గడిపిన వారిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. గుజరాత్ లోని గాంధీనగర్‌లో అఖిల భారత పోలీసు సైన్స్‌ కాన్ఫరెన్స్‌(ఏఐపీఎస్ సీ)లో ప్రసంగించిన కేంద్ర మంత్రి.. అర్హులైన ఖైదీల్లో ఒక్కరు కూడా రాజ్యాంగ దినోత్సవం తర్వాత జైల్లో ఉండకూడదన్నది తమ అభిమతమన్నారు.
ఏవైనా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రిమాండ్ కు వెళ్లిన ఖైదీలు.. నిర్దిష్ట కాలం తర్వాత కూడా జైలులోనే ఉండిపోతున్నారు. కోర్టుల్లో కేసుల రద్దీ, పోలీసు విచారణ, అఫిడవిట్ దాఖలుకు ఎక్కువ సమయం తీసుకోవడం సహా.. అనేక ఇతర కారణాలతో కేసుల విచారణ ఆలస్యం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది నిర్దోషులు సైతం జైళ్లల్లోనే మగ్గిపోతున్నారు. చివరికి.. ఇలాంటి కేసుల్లో చాలా వాటిలో ఖైదీలు నిర్దోషులుగా బయటపడుతున్నారు. కానీ.. అప్పటికే ఆయా కేసుల్లో విధించే జైలు జీవితాల్ని గడిపేస్తు్న్నారు. ఇది.. వారి హక్కుల్ని లాగేసుకోవడమే అని చాన్నాళ్లుగా న్యాయస్థానాలు, కేంద్రం అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్టికి విచారణ దశలోని ఖైదీల విడుదలకు మార్గదర్శకాలు రూపొందించి, వారిని విడుదలకు తేదీలను సైతం ప్రకటించారు.

ఖైదీల విడుదలకు 60 నిబంధనలను న్యాయస్థానాలు, ప్రాసిక్యూషన్‌, పోలీసుల ముందు ఉంచినట్లు తెలిపిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… ఖైదీల తరఫున జైలు అధికారులే బెయిల్ ప్రక్రియను చేపట్టే అవకాశం కల్పించారు. ఇందుకోసం జాతీయ ఈ- ప్రిజన్ పోర్టర్ ను వినియోగించుకోవాలని సూచించారు. 2023లో అమల్లోకి తీసుకువచ్చిన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS)లోని సెక్షన్ 479 ని అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. దీని ప్రకారం.. నేరం రుజువు కాకుండానే ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉన్న ఖైదీలకు బెయిల్‌ను అనుమతిస్తుంది. అయితే.. ఈ నిబంధన జీవిత కాలం లేదా మరణ శిక్ష పడే అవకాశం ఉన్న ఖైదీలు, నేరస్తులకు వర్తించదన స్పష్టం చేసింది.


Also Read : మంత్రిగారికి మాతృభాష రాదు.. కార్యక్రమంలో అందరిముందు విద్యాశాఖ మంత్రిపై విద్యార్థి వ్యాఖ్యలు

భారతీయ జైళ్లల్లో విపరీతమైన రద్దీ ఉంది. వాటి వాస్తవ సామర్థ్యం కంటే చాలా ఎక్కువగా ఖైదీలు జైళ్లల్లో ఉంటున్నట్లు అనేక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB), ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా- 2022 నివేదికల ప్రకారం.. దేశంలోని జైళ్లల్లో ఉన్న వారిలో ప్రతీ 100 మందిలో 75 మంది విచారణ ఖైదీలే అని తెలిపుతున్నాయి. అంటే.. ఎలాంటి నేరాలు రుజువు కాకుండానే అంత మంది జైలు జీవితాల్ని గడుతుపుతున్నారు. ఓ నివేదిక ప్రకారం.. 2022 చివరి నాటికి దేశంలోని జైళ్లల్లో ఉన్న 5.73 లక్షల మంది ఖైదీల్లో 4.34 లక్షల మంది విచారణ ఖైదీలే కావడం ఆలోచించాల్సిన అంశం.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×