Big Stories

Delhi CM Arvind Kejriwal Arrested: సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు..

Delhi CM Arvind Kejriwal Arrest
Delhi CM Arvind Kejriwal Arrest

Delhi CM Arvind Kejriwal Arrested(today’s breaking news in India): ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ పాలసీ కేసులో ఆయన నివాసంలో రెండున్నర గంటలు తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో తనని అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన పిటషన్ దాఖలు చేయగా.. ఢిల్లీ హైకోర్టు దాన్ని నిరాకరించింది. ఈ తరుణంలో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

కేజ్రీవాల్ కు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తరుణంలో కేజ్రీవాల్ అరెస్ట్ పై ఆప్ మంత్రి, ఆప్ కీలక నేత అతిశీ స్పందించారు. ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాల్ నే సీఎంగా కొనసాగుతారని.. ఆయన జైలు నుంచే ప్రభుత్వాని నడుపుతారని తెలిపారు. అయితే సీఎంను అరెస్ట్ చేయడంపై ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. దీనిపై ఈరోజు రాత్రే విచారణ జరపాలని కోరామన్నారు.

- Advertisement -

ఈ మద్యం పాలసీ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీశ్ సిసోడియా గత రెండేళ్లుగా ఈ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం కవితను ఐదో రోజు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు రూ.1,00 కోట్ల మేర ఈ కేసులో అవినీతి జరిగినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే పలు మార్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఢిల్లీ సీఎం అరెస్ట్ కావడంతో ఢిల్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఢిల్లీలోని సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న 12 మంది ఈడీ అధికారులు ఆయన ఇంట్లో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తనిఖీలు చేస్తున్నారు. వీరంతా సెర్చ్ వారెంట్ తోనే వచ్చి తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. కేజ్రీవాల్ ఫోన్ తీసుకు తీసుకుని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో భారీగా ఆప్ నేతలు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఎంటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు ఆయన ఇంటి చుట్టూ మోహరించారు. సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకునే అన్ని దారులను ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర బలగాలు మూసివేశాయి. దీంతో పాటుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్దుకు భారీ సంఖ్యలో బలగాలు మోహరించాయి.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ హైకోర్టు మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కు మద్యంతర ఉపసమనాన్ని నిరాకరించడంతో.. ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

మద్యం కుంభకోణం కేసులో కేేజ్రీవాల్ ఇంటిలో ఈడీ అధికారులు తనిఖీలు చేయడాన్ని పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ఖండించారు. సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News