Delhi News: ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. బుధవారం ఉదయం తన నివాసంలో జన్‌సున్‌వాయ్ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. దాడి చేసిన నిందితుడు ఫిర్యాదుదారుడిగా వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి ముఖ్యమంత్రిపై దాడికి దిగినట్టు ప్రభుత్వ వర్గాల మాట. ఘటన తర్వాత వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రజలను సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో జన్ సున్వాయ్ కార్యక్రమాన్ని చేపట్టారు సీఎం రేఖాగుప్తా. ప్రతీ బుధవారం ఈ కార్యక్రమం జరుగుతుంది. బుధవారం ఉదయం సీఎం తన నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుడి రూపంలో వచ్చిన 35 ఏళ్ల ఓ వ్యక్తి, సీఎం రేఖాగుప్తా చెంప చెళ్లుమనిపించినట్టు తెలుస్తోంది.
గుప్తాకు గాయాలు కానప్పటికీ ఈ ఘటన ఆమెను షాక్‌కు గురిచేసింది. వెంటనే అల్టయిన సెక్యూరిటీ అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రిపై దాడికి ముందు కొన్ని పత్రాలను ఆమెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ వ్యక్తి.. ఆమె జుట్టు లాగి చెంపదెబ్బ కొట్టినట్టు ప్రత్యక్ష సాక్షుల మాట.
వెంటనే వైద్యుల బృందం గుప్తా నివాసానికి చేరుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి దాడి వెనుక అసలు కారణమేంటి? ముఖ్యమంత్రిని కొట్టాల్సిన అవసరం ఆ వ్యక్తికి ఏమోచ్చింది. దీనివెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
ALSO READ: ప్రజా ప్రతినిధులపై కొత్త చట్టం.. ప్రధాని మొదలు మంత్రుల వరకు
గుప్తాపై జరిగిన దాడిని ఢిల్లీ బీజేపీ యూనిట్ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు బయటపెట్టారు. నిందితుడు ముఖ్యమంత్రి వద్దకు వచ్చి కొన్ని పత్రాలను అందజేశాడని అన్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలీదుగానీ వెంటనే ప్రజలు అతడ్ని పట్టుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి తలపై స్వల్ప గాయం అయ్యిందని వెల్లడించారు. అతడు ఎవరు? చెంపదెబ్బ కొట్టడానికి దారి తీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేఖాగుప్తాను వైద్యులు పరీక్షించారు. అయితే జాన్ సున్వాయి కార్యక్రమం కొనసాగుతుందని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆమె కార్యక్రమాలను రద్దు కావని అంటున్నాయి.
మరోవైపు ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ ఈ దాడిని ఖండించారు. శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రికి భద్రత లేకుంటే రాజధానిలో సామాన్యుడు ఎలా సురక్షితంగా ఉండగలడని ప్రశ్నించారు. ఈ సంఘటన మహిళల భద్రతను బహిర్గతం చేస్తుందన్నారు.
అటు ఈ దాడిని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరారు మాజీ సీఎం అతిషి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, నిరసనలకు చోటు ఉంటుందన్నారు. కానీ హింసకు ఏమాత్రం చోటు లేదన్నారు మాజీ సీఎం.
#WATCH | Delhi BJP president Virendraa Sachdeva says, "During Jan Sunvai this morning, CM was speaking with the public like she always does. A man approached her, presented some paper and suddenly held her hand while trying to pull her towards him. During this, there was a little… pic.twitter.com/r2FiC9ADej
— ANI (@ANI) August 20, 2025
VIDEO | Delhi Chief Minister Rekha Gupta was allegedly attacked at a 'Jan Sunwai' programme at her official residence in Civil Lines. Visuals from outside her residence.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/Fv2Dfb0Gxc
— Press Trust of India (@PTI_News) August 20, 2025