Delhi Protest: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో ముగ్గురు విడుదలయ్యారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం ముంబై నుంచి వచ్చిన వీరిని ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 22 గంటల పాటు పోలీసు కస్టడీలో ఉన్న ఈ ముగ్గురు నేతలను ఆదివారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
అనంతరం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. షరతుల ప్రకారం ముగ్గురూ ఒక ఏడాది పాటు ఎటువంటి శాంతిభద్రతల విఘాతానికి పాల్పడకూడదు. భవిష్యత్తులో సత్ప్రవర్తన కలిగి ఉంటామన్న హామీతో 50వేల బెయిల్ బాండ్‌ను సమర్పించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు ఉంటే తప్ప మిగతా అన్ని చోట్లా ఏర్పాటు చేసిన బారికేడ్లను సమీక్షించి తొలగించాలని అధికారులను ఆదేశించింది.
విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే పునరుద్ధరించామని, మెట్రో కార్యకలాపాలు కూడా పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాయని కోర్టుకు తెలియజేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మెట్రో స్టేషన్ల మూసివేతపై వ్యక్తమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని దీనిపై మరిన్ని వివరాలు సమర్పించాలని కోరుతూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
Also read: ఏపీలోని బీసీలకు భారీ గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!